Home Latest News స్టీల్ బ్రిడ్జ్ ఈ -13 రోడ్డు నిర్మాణాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు | అమరావతి | ఉక్కు వంతెన | బకింగ్‌హామ్ కాలువ | ADCL | మంగళగిరి | కొండ కోత | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ | మంత్రి నారాయణ – Andhra Waves

స్టీల్ బ్రిడ్జ్ ఈ -13 రోడ్డు నిర్మాణాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు | అమరావతి | ఉక్కు వంతెన | బకింగ్‌హామ్ కాలువ | ADCL | మంగళగిరి | కొండ కోత | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ | మంత్రి నారాయణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి, అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ కుట్రలు పన్నుతూనే ఉంది. అభివృద్ధి పనుల్లో లోపాలు, అవినీతి అంటూ విషం చిమ్ముతూనే ఉంది. అందులో భాగంగా అమరావతిని 16వ నెంబరు జాతీయ రహదారితో కలుపుతూ బకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వైసీపీ తన అనుకూల మీడియాలో విషప్రచారం ప్రారంభించింది. అయితే ఆ వార్త పూర్తిగా అవాస్త‌వమని అమరావతి డెవ‌ల‌ప్‌ కార్పొరేష‌న్‌మెంట్ అందించింది. బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని.. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అమరావతి డెవలెప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) స్పష్టం చేసింది.

అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిని నేషనల్ హైవే 16కు కనెక్ట్ బ్యాకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జిని ఈ ఫిబ్రవరికి పూర్తిచేయాలనుకున్నా సాధ్యపడలేదు.. అయితే త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఇంతలో స్టీల్ బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలైంది. ఈ బ్రిడ్జికి సంబంధించి రెండో వంతెన మధ్యలో గడ్డర్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఒంగిపోయాయని ప్రచారం. గడ్డర్లు వంకర ఉన్న చోట్ల తొలగించి మళ్లీ బిగించి శ్లాబు వేస్తున్నారు.
స్టీల్ బ్రిడ్జి గద్దర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఏడీసీఎల్ స్పందించారు.

బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఈ స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో ప్రత్యేక సాంకేతిక విధానాలతో పొడవైన గడ్డర్లను తయారుచేసి జైంట్ చేస్తారని ఏడీసీఎల్ ప్రదర్శించింది. గడ్డర్లకు సంబంధించి ఇంజినీరంగ్ ప్రమాణాలకు తగిన విధంగా చిన్న సవరణలు మాత్రమే చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో గడ్డర్లు మిల్లీమీటర్ల స్థాయిలో బేరింగ్‌లపై అమర్చాల్సి ఉంటుందన్నారు. స్ట్రీల్ బ్రిడ్జి నిర్మాణంలో, భద్రత అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ అంశంపై స్పందించింది.

బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మాణ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్రంగా ఖండించింది. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో పొడవైన గడ్డర్లు జైంట్ చేస్తారని, బేరింగ్‌లపై గడ్డర్లు అనుసంధానించేటప్పుడు.. ఒక్కోసారి గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తారని, అంతే కానీ గడ్డర్లు ఒరిగిపోతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వివరించారు. మరోవైపు మంగళ ఏయిమ్స్ సమీపంలోని పర్యావరణ శాఖకు చెందిన ప్రకృతి కళ్ళు కొండలను అక్రమంగా తవ్వేస్తూ, విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రసారం చేసింది.

మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన E13 రోడ్డు నిర్మాణ పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. మంగళగిరి ఏయి మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్‌కు వెళ్లే రహదారి మార్గంలో కొండ భాగం అడ్డుగా ఉందని, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ‘హిల్ కట్టింగ్’ పనులను చేపట్టిందని వివరించింది.

వాస్తవానికి ఏడీసీఎల్ నిర్వహిస్తున్న ఈ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన అన్ని రకాల పర్యావరణ.అధికారిక అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం E13 రహదారి అభివృద్ధి పనులు, సోషల్ మీడియాలో కొందరు అక్రమ కొండల తవ్వకం, ప్రకృతి విధ్వంసం అంటూ తప్పుడు రంగు పులిమి తప్పుదారి పట్టిస్తున్నారని, కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం క్లారిటీ ఇచ్చింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird