Home సినిమా ‘పెద్ది’ ర్యాంపేజ్ స్టార్ట్.. నార్త్ అమెరికాలో సంచలన రికార్డు సృష్టించిన రామ్ చరణ్! – Andhra Waves

‘పెద్ది’ ర్యాంపేజ్ స్టార్ట్.. నార్త్ అమెరికాలో సంచలన రికార్డు సృష్టించిన రామ్ చరణ్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (రామ్ చరణ్), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (పెద్ది) బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని అప్పుడే ప్రారంభించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికాలో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘RRR’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఉన్నారు. దీనికి నిదర్శనంగా నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే ‘పెద్ది’ ఊహించని రీతిలో స్పందన రాబట్టింది.

నార్త్ అమెరికాలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమా $100K (ఒక లక్ష డాలర్లు) మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే $50K పైగా వసూలు చేసి తన ‘ర్యాంపేజ్’ను చాటిచెప్పింది. ప్రత్యంగిర సినిమా ఈ ఓవర్సీస్ లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3న నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రిమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో రామ్ చరణ్ విభిన్నమైన లుక్‌లో పహిల్వాన్‌గా కనిపించనున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రం ప్రధాన ఆకర్షణ.

టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసే దిశగా ‘పెద్ది’ దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తుంటే, విడుదల సమయానికి ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird