మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన కల్లు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం. పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం(7-5-26న) సోదాలు నిర్వహించారు. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణల కేసుల్లో భాగంగా ఈడీ దాడులు చేసింది.
కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్స్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్స్ట్రక్షన్స్ సహా అనుబంధ సంస్థలకు చెందిన ఆఫీసులపై దాడులు చేశారు. మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలోని వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం.
నేలపై నోట్ల కట్టలు పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నగదుకు భూ కుంభకోణం కేసుతో సంబంధం ఉందా, లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు నగదు సంచులు దొరికినట్లు ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ వీడియోలను ఎస్ఏడీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈడీ దాడుల సందర్భంగా నగదును ఇలా పడేశారంటూ పోస్టులో చేర్చాడు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
