తెలంగాణలో ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. పంచాయతీ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆ ఉత్సాహంతో మునిసిపోల్స్ కు వెళ్లింది. బుధవారం (ఫిబ్రవరి 11) రాష్ట్రంలో 16 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్స్ పోల్సన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంకెంత మాత్రం జాగు లేకుండా పరిషత్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు మార్చిలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
విజయోత్సాహం ఒక వైపు.. ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పరిషత్ ఎన్నికలు నిర్వహించడం చకుంటే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 450 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయన్న భయంతో, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రస్తుతం త్వరగా నిర్వహించాలని కోరుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చే నెల తొలి వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు రెండు విడతలలో జరుగనున్న సూచికలు.
