ప్రేమంటే ఇదే.. అంటున్న మధ్యప్రదేశ్ జంట
ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్..
ప్రేమకు అసలు సిసలు నిర్వచనం చెప్పారు జంట. మనసులు కలిస్తే హోదాలు, మతాలు ఏవీ అడ్డుకావని మధ్యప్రదేశ్లో ఓ జంట నిరూపించింది. ఖైదీలను పర్యవేక్షించాల్సిన జైలు అధికారిణి.. తన వద్దే శిక్ష అనుభవించి విడుదలైన ఒక మాజీ ఖైదీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని సత్నా కేంద్ర కారాగారంలో ఫిరోజా ఖాతూన్ అనే మహిళ.. సహాయ డిప్యూటీ జైలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2007లో జరిగిన హత్య కేసులో ధర్మేంద్ర అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. సత్నా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఫిరోజా ఖాతూన్తో ధర్మేంద్రకు పరిచయం ఏర్పడింది. శిక్షా కాలంలో ధర్మేంద్ర ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమెను ఎంతో ఆకర్షిస్తుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.మాటలు వేరు కావడంతో ఈ పెళ్లికి ఫిరోజా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. సమాజం గురించి పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
వీరి వివాహ వేడుక ఇటీవల ఛతర్పూర్ ఏర్పాటు లవ్కుష్ నగర్లో అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం మతానికి చెందిన ఫిరోజా ఖాతూన్.. హిందూ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ధర్మేంద్రను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడారు. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం.. మతసామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. వీహెచ్పీ నేతలు దగ్గరుండి వీరి పెళ్లి చేశారు. ఒకప్పుడు నిందితుడిగా జైలులో గడిపిన వ్యక్తి.. ఇప్పుడు ఒక అధికారిణికి భర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
.webp)