Home Latest News తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి ధర్మారెడ్డి.. తేల్చి చెప్పిన కమిషన్ నివేదిక | తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం వెనుక సూత్రధారి ధర్మారెడ్డి | వన్ మ్యాన్ కమిటీ | నివేదిక సమర్పించారు – Andhra Waves

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి ధర్మారెడ్డి.. తేల్చి చెప్పిన కమిషన్ నివేదిక | తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం వెనుక సూత్రధారి ధర్మారెడ్డి | వన్ మ్యాన్ కమిటీ | నివేదిక సమర్పించారు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఈ కమిటీ నివేదిక తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వ్యవహారంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డే సూత్రధాని తేల్చింది. ఆయనతోపాటు మరో అధికారి సింఘాల్, ఆర్థిక సలహాదారుడు, చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ బాలాజీ, ప్రొక్యుమెంటర్ ఆఫీసర్లు జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు విజయ భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్రధారులని ఏకసభ్య కమీషన్ నివేదిక ఇచ్చారు.

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను డిప్యూటేషన్ పై తెచ్చుకునిమరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు. ఇప్పుడు అదే అధికారి టిటిడి లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి కారణాలతోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ ఏకసభ్య కమీషన్ నిర్థారించింది.


2019 జూన్ లో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలోనే అంటే జూలైలో నే ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2022 మే వరకు అదే హోదాలో కొనసాగారు. ఆ తరువాత నుంచీ టీటీడీ ఈవోగా కొనసాగుతుంది. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు తీసుకున్నతరువాత.. నెయ్యి సరఫరాకు సంబంధించి కొన్ని రకాల నిబంధనలను సడలించారు. నెయ్యి సరఫరాదారుల అర్హతలు, విశ్వసనీయత, అనుభవం, సమర్థత, నాణ్యత హామీలు నిలబెట్టుకోవడం, పర్యవేక్షణ, తనిఖీలు వంటి వాటిని గాలికి వదిలేశారు. ఫలితంగానే కల్తీ అయిన నెయ్యి టీటీడీలో ప్రవేశించిందని విచారణలో ఏకసభ్య కమిషన్ తేల్చింది. కాకుండా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పాలక మండలికి నెయ్యి సేకరణలో నిబంధనలను సడలించిన విషయాన్ని తెలియజేయలేదని కూడా తన కమీషన్ నివేదికలో పేర్కొంది. ఇప్పుడీ కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird