-రిలీజ్ కి ముందే పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా టాక్సిక్
-కియారా, యష్ మధ్య బోల్డ్ సీన్స్
-దయచేసి కట్ చెయ్యడంటున్న కియారా
-మేకర్స్ ఏం చేయబోతున్నారు
టాప్ హీరోయిన్ కియారా అద్వానీ(కియారా అద్వానీ)అప్ కమింగ్ మూవీ ‘టాక్సిక్(టాక్సిక్). పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలుసా. రిలీజ్ డేట్ విషయంలో తడబాటుకి గురువవుతున్న టాక్సిక్ కి ఇప్పుడు కియారా అద్వానీ షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్(యష్)పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమెట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రిక్వెస్ట్ చేసిన మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. ఈ సీన్స్ శృతి మించి ఉండటమే కియారా రిక్వెస్ట్ కి కారణమని తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాక్సిక్ టాపిక్ మరో సారి వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు అదిరిపోయే న్యూస్
ఈ విషయంపై సినీ ప్రియులు సూచన కియారా అద్వానీ గ్లామర్ గా చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడదు. కానీ అలాంటి కియారానే సీన్స్ తొలగించమని కోరుతూ ఉందంటే ఏ స్థాయిలో బోల్డ్ సీన్స్ ప్రదర్శించి ఉంటాయో అనే కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ రిలీజైనప్పుడు కూడా అసభ్యత శృతిమించి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రిలీజ్ కి ముందే టాక్సిక్ పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతుంది. డ్రగ్ మాఫియా క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో టాక్సిక్ రూపొందించబడింది.
