నేపాల్లోని రోల్పా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జీపు కొండ మార్గంలో అదుపుతప్పి సుమారు 800 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జల వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా రహదారి జారుడుగా మారడమే ఈ ప్రమాదానికి కారణంగా ఉంది.
సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే, విపరీతంగా కురుస్తుండటం, లోయ అత్యంత లోతుగా వర్షం ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. నేపాల్ కొండ ప్రాంతాలు సక్రమంగా లేకపోవడం, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి కారణాల వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం కూడా ప్యుఠాన్ జిల్లాలో జరిగిన ఇటువంటి ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
.webp)