Home Latest News ట్రంప్ వ్యూహాల్లో స్పష్టత శూన్యం.. ఇరాన్ తో చేస్తున్నది గెలవలేని యుద్ధం! | ట్రంప్ వ్యూహాల్లో స్పష్టత లేదు | యుద్ధం | ఇరాన్‌కు వ్యతిరేకంగా – Andhra Waves

ట్రంప్ వ్యూహాల్లో స్పష్టత శూన్యం.. ఇరాన్ తో చేస్తున్నది గెలవలేని యుద్ధం! | ట్రంప్ వ్యూహాల్లో స్పష్టత లేదు | యుద్ధం | ఇరాన్‌కు వ్యతిరేకంగా – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా మాజీ సైనిక అధికారి కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ సంచలన విశ్లేషణ చేశారు. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఒక స్పష్టమైన వ్యూహం కంటే, అనిశ్చితితో కూడిన సంక్షోభంలా కనిపిస్తున్నాయని. అగ్రరాజ్యం తీసుకునే ఏ నిర్ణయమైనా అంతిమంగా అమెరికాకే నష్టం కలిగించేలా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఒక వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకున్నారని అభిప్రాయపడ్డారు. మాక్‌గ్రెగర్ విశ్లేషణ ప్రకారం.. అమెరికా ముందు ఇప్పుడు రెండు క్లిష్టమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది.. ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు చేయడం. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరా నిలిచిపోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇక రెండో మార్గం.. దాడులు తగ్గించి వెనక్కి తగ్గడం. ఇలా చేస్తే దేశీయంగా బలహీనత అనే ముద్ర పడటమే కాకుండా, మిత్రదేశాల దృష్టిలో అమెరికా ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఈ రెండు దారుల్లోనూ ఓటమి కనిపిస్తున్నందున, ట్రంప్ ఎటు తేల్చుకోలేక కాలయాపన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సైనిక అగ్రరాజ్యం తక్కువ అంచనా వేస్తోందని మాక్‌గ్రెగర్ హెచ్చరిక. గతంలో అమెరికా యుద్ధం చేసిన ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో ఇరాన్‌ను పోల్చడం చారిత్రక తప్పిదమే అవుతాయి. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు అమెరికా నౌకాదళానికి పెద్ద ముప్పుగా మారాయి. అందుకే అమెరికా నౌక యుద్ధాలు ఇరాన్ తీరానికి సుదూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్ర నిర్బంధం ఒక యుద్ధ చర్య. అందుకే. నిర్బంధం కొనసాగుతున్నంత వరకు చర్చలు లేవు అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంకా.. మాక్‌గ్రెగర్ అంచనా ప్రకారం, ఇరాన్ వద్ద ఇప్పటికీ సుమారు 15 వేల నుంచి 20 వేల క్షిపణులు, 40 నుంచి 50 వేల డ్రోన్‌లు ఉన్నాయి. ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా ధ్వంసమైందనడం కల్పితమే. అన్నిటికీ మించి.. ఇరాన్ నాయకత్వం సంఘటితంగా, నియంత్రణలో ఉంది. అమెరికా–ఇజ్రాయెల్ టార్గెటెడ్ మర్డర్స్ ముప్పు కారణంగానే సీనియర్ కమాండర్లు పబ్లిక్‌గా కనిపించడం లేదు.

నిర్బంధం కొనసాగుతున్నంత వరకు నిజమైన చర్చల అవకాశం లేదు. అయినా.. ఈ సంక్షోభం వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు మాక్‌గ్రెగర్. వైట్ హౌస్ చుట్టూ ఉన్న కొందరు ఆర్థికవేత్తలు, మార్కెట్లలో వచ్చే లీకుల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదిస్తున్నారు. చర్చలు సఫలమవుతాయనే అశాజనక ప్రకటనలు వచ్చినప్పుడు మార్కెట్లు స్పందించడం.. లోపలి సమాచారం తెలిసిన వారు లబ్ధి పొందడం ఒక పద్ధతిగా మారింది.

పాకిస్తాన్ వంటి మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు.. అమెరికా వైపు నుంచి సీరియస్ చర్చలు జరగలేదు. అంతర్జాతీయ సమీకరణలను గుర్తించే.. చైనా, రష్యా వంటి దేశాలు ఇరాన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇరాన్‌ను కేవలం ఒక ప్రాంతీయ దేశంగా కాకుండా ఒక గొప్ప నాగరికత గల శక్తిగా అవి పరిగణిస్తున్నాయి. మరోవైపు, అమెరికా తన మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియా, గల్ఫ్ దేశాలను రక్షించగలదా అనే సందేహం ఇప్పుడు. సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ దశలో ఇప్పుడు అమెరికా క్షిపణి దాడులను అడ్డుకోలేకపోతే, ప్రపంచ రాజకీయాల్లో అగ్రరాజ్యంగా దాని హోదా మసకబారిపోయే ప్రమాదం ఉంది. మాక్‌గ్రెగర్ ఇదే విషయం చెబుతున్నారు. ఈ యుద్ధం ట్రంప్ అధ్యక్ష పదవికే గండంలా మారవచ్చంటున్నారు. చివరికి అమెరికా వియత్నాం తరహాలో మధ్యప్రాచ్యం నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేశారు. ఇరాన్‌పై స్పష్టమైన యుద్ధ వ్యూహం లేకపోవడం, ఆర్థిక ముప్పులు మరియు మిత్రదేశాల అపనమ్మకం వెరసి ఈ సంక్షోభం అమెరికా శక్తిని ప్రపంచ వేదికపై బలహీనపరిచే అవకాశం ఉందని మాక్‌గ్రెగర్ తన విశ్లేషణలో స్పష్టం చేశారు.

-సీతారాం, కంఠంనేని

సూచనలు

https://scheerpost.com/2026/04/22/no-peace-only-escalation-the-push-toward-total-war-with-iran/
https://www.listennotes.com/podcasts/palisades-gold-radio/col-douglas-macgregor-s9_7SHxGU5q/
https://www.eurasiareview.com/04032026-us-cannot-subdue-iran-says-trumps-former-defence-advisor-oped/
https://podscripts.co/podcasts/judging-freedom/col-douglas-macgregor-trump-and-his-war-on-iran
https://www.youtube.com/watch?v=t-4ATfSHvEk
https://singjupost.com/douglas-macgregor-iran-war-destroyed-nato-gulf-states-israel-us-empire-transcript/
https://www.newstarget.com/2025-06-25-douglas-macgregor-posted-a-wise-analysis-regarding-iran-strikes.html
https://www.military-stuff.org/pakistan-led-us-iran-war-talks-stall-now-what-col-douglas-macgregors-dire-prediction/
https://www.video-translations.org/transcripts/3584_Pascal_2026_04_09.pdf
https://henriscounty.com/2025/06/us-army-colonel-retired-macgregors-statement-after-trump-struck-irans-three-nuclear-facilities/


ఈ విశ్లేషణ మీకు నచ్చింది.. https://teluguone.com ను ఫాలో అవ్వండి..షేర్ చేయండి.. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird