Home సినిమా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు.. సపోర్ట్ చేయండి – Andhra Waves

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు.. సపోర్ట్ చేయండి – Andhra Waves

by
0 comments
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు.. సపోర్ట్ చేయండి



-కట్టప్ప కూతురంటే ఏం అనుకుంటున్నారు
-అల్లాటప్పా కాదు
-నా స్టైల్ నే వేరప్పా
మరి కట్టప్ప కూతురు కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం

తండ్రి పోలికలు కూతురుకి వస్తే అదృష్టం అంటారు. అలాంటిది మరి అచ్చు గుడ్డినట్టు తండ్రి రూపాన్నే పుణికి పుచ్చుకుంటే.. అదృష్టం స్థాయి ఇంకొంచం ఎక్కువ అని చెప్పవచ్చు. మరి అలాంటి ఒక అదృష్ట వంతురాలు మన కట్టప్ప డాటర్ దివ్య సత్యరాజ్(Divya Sathyaraj). వృత్తి రీత్యా న్యూట్రిషనిస్ట్. ఆరోగ్యం, పోషణ మరియు ఆహార శాస్త్రానికి సంబంధించిన డాక్టర్. ఇప్పుడు ఈ డాక్టర్ మాటల దెబ్బకి ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అని కొంత మంది నెటిజన్లు పాడుకునే పరిస్థితి. మరి ఈ డాక్టరమ్మ ఏం మాట్లాడిందో చూద్దాం.

రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దివ్య మాట్లాడుతుంది ‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని నేను భావించడం లేదు. ఒక పురుషుడు, ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదు. నా వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధం. ఒక మహిళకి తన శరీరంపై తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుంది. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే మనసుల కలయికే ముఖ్యమని చెప్పుకుంది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవ్వడమే కాకుండా వైరల్ కి సరికొత్త పదాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. ఈ డాక్టరమ్మ ఇంతటితోనే ఆగలేదు. మూఢనమ్మకాలు, జాతకాలపై తన ప్రతాపాన్ని చూపించింది. మా నాన్న నాస్థికుడు కావడంతో నా జాతకం రాయలేదు. ఈ విషయంలో జాతకం లేని అమ్మాయిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని కూడా వెల్లడి చేసింది.

ఇది కూడా చదవండి: ప్రభాస్: ప్రభాస్ స్టైల్ లో మార్పులు

దీంతో కొంత మంది ఆమె అభిప్రాయాలని ఏకీభవిస్తూ, మెజారిటీ నెటిజన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. డాక్టరమ్మ పెళ్లి అనే పవిత్రమైన బంధం కాబట్టే ఇంకా ఈ విశ్వం తన మనుగడ కోసం చాలా డేర్ గా కొనసాగుతోంది. జాతకాలు అనేవి లేనప్పుడు రాత్రి, పగలు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కట్టప్ప డాటర్ డాక్టరమ్మ తన మాటలతో మంత్ ఎండ్ అని డల్ గా ఉన్న వాళ్ళల్లో కూడా జోష్ ని తీసుకొచ్చింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird