Home Latest News తెలంగాణ మున్సిపల్ కొలకు కొత్త పాలకవర్గం | మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు| కొలగాని శ్రీనివాస్|కరీంనగర్ మేయర్| తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు|నిజామాబాద్ మేయర్| కొత్తగూడెం సీపీఐ కాంగ్రెస్ కూటమి| మున్సిపల్ చైర్మన్ ఎన్నిక| BRS| కేటీఆర్| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

తెలంగాణ మున్సిపల్ కొలకు కొత్త పాలకవర్గం | మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు| కొలగాని శ్రీనివాస్|కరీంనగర్ మేయర్| తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు|నిజామాబాద్ మేయర్| కొత్తగూడెం సీపీఐ కాంగ్రెస్ కూటమి| మున్సిపల్ చైర్మన్ ఎన్నిక| BRS| కేటీఆర్| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలంగాణ మున్సిపల్ కొలకు కొత్త పాలకవర్గం | మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు| కొలగాని శ్రీనివాస్|కరీంనగర్ మేయర్| తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు|నిజామాబాద్ మేయర్| కొత్తగూడెం సీపీఐ కాంగ్రెస్ కూటమి| మున్సిపల్ చైర్మన్ ఎన్నిక| BRS| కేటీఆర్| కేసీఆర్| కాంగ్రెస్ పార్టీ


తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు ఏర్పడి అధికార బాధ్యతలు చేపట్టాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం స్థానిక సంస్థలపై పార్టీల ఆధిపత్యం స్పష్టమైంది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు చేరగా, బీఆర్ఎస్‌కు 17 మున్సిపాలిటీలు దక్కాయి. బీజేపీ ఒక మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇక సీపీఐ ఖాతాలో ఒక కార్పొరేషన్ చేరగా, ఇండిపెండెంట్లు నాలుగు మున్సిపాలిటీల్లో విజయం సాధించారు.

తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ ఐదు కార్పొరేషన్లలో ఆధిపత్యం చాటుకోగా, కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయం. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు సమాన స్థానాలు రావడంతో రెండు పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చాయి. ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్‌కు నిర్ణయించారు.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతుతో మేయర్ పదవిని గెలుచుకుంది. మొదటి నుంచే ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కడం ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా, కీలక నగరాల్లో బీజేపీ, సీపీఐలు కూడా తమ ముద్ర వేయగలిగాయి. దీంతో రాష్ట్ర స్థానిక సంస్థల సమీకరణలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కార్పొరేషన్ల వారీగా మేయర్లు – డిప్యూటీ మేయర్లు

కరీంనగర్ కార్పొరేషన్ – మేయర్: కొలగాని శ్రీనివాస్ (బీజేపీ), డిప్యూటీ మేయర్: సునీల్ రావు (బీజేపీ)

నిజామాబాద్ కార్పొరేషన్ – మేయర్: ఉమారాణి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: సల్మా తహసీన్ (మజ్లిస్)

రామగుండం కార్పొరేషన్ – మేయర్: మహంకాళి స్వామి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)

కొత్తగూడెం కార్పొరేషన్ – మేయర్: మూడ్ గణేశ్ (సీపీఐ), డిప్యూటీ మేయర్: సిరిపురపు లలిత కుమారి (కాంగ్రెస్)

నల్గొండ కార్పొరేషన్ – మేయర్: బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ – మేయర్: గుమల్ మమత (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)

మంచిర్యాల కార్పొరేషన్ – మేయర్: మధుకర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్: రమ్య మహేశ్ (కాంగ్రెస్)

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird