Home Latest News విజిల్ పై బ్యాన్.. విజయ్ భయమేనా? | చెపాక్ స్టేడియంలో విజిల్‌పై నిషేధం| icc| టీ20 ప్రపంచకప్| dmk| భయం| tvk| ఉచిత – Andhra Waves

విజిల్ పై బ్యాన్.. విజయ్ భయమేనా? | చెపాక్ స్టేడియంలో విజిల్‌పై నిషేధం| icc| టీ20 ప్రపంచకప్| dmk| భయం| tvk| ఉచిత – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తమిళనాడులో ఇప్పుడు నటుడు దళపతి విజయ్ రాజకీయపార్టీ టీవీకే రాజకీయ చర్చ అంతా కేంద్రీకృతమై ఉంది. ఈ ఏడాది తమళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఆ పార్టీ ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుంది. ఎన్నికలలో ఆ పార్టీ చూపే ప్రభావమెంత అన్న విషయంపైనే పరిశీలకులు పలు విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అది పక్కన పెడితే కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది. సాధారణంగా చెన్నైలో ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే మైదానంలో ఆటను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు తమ అభిమాన జట్టుకు మద్దతుగా విజిల్స్ మోగిస్తారు. మైదానం విజిల్ కూతలతో మార్మోగిపోతుంటుంది. అంతెందుకు చెన్నై సూపర్ కింగ్స నినాదమే విజిల్ పోడు.

సరే చెపాక్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లే కాదు దేశవాళా మ్యాచ్ లో జరిగిన ప్రతి సందర్భంలోనూ స్టేడియం బయట విజిల్స్ విక్రయిస్తారు. ఆటను చూడటానికి స్టేడియంకు వచ్చే ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేసి తమ అభిమాన జట్టకు విజిల్ సౌండ్‌తో మద్దతు ఇస్తున్నారు. చెపాక్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగేదే.

అయితే ఆదివారం (ఫిబ్రవరి 8) చెపాక్ స్టేడియం వేదికగా టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గృహ, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్టేడియంలో ఎక్కడా విజిల్ సౌండ్ వినిపించలేదు. అంతే కాదు.. స్టేడియం బటట విజిల్స్ విక్రయాలు కూడా వేవు. ఇందుకు కారణం స్టేడియంలోకి విజిల్స్‌ను అనుమతించబోమంటూ నిర్వాహకులు ప్రకటించడమే. అయితే ఇది ఐసీసీ విధించిన నిబంధన కాదు. మరేమిటి ప్రభుత్వమే అనధికారికంగా విజిల్స్ పై బ్యాన్ విధించడమే ఇందుకు కారణం.

టీవీకే పార్టీకి ఎన్నిక సంఘం విజిల్‌ను ఎన్నిక గుర్తుగా కేటాయించిన క్షణం మొదలుకుని ఆ పార్టీ మీటింగ్స్‌లో విజిల్స్ మోత మోగిస్తున్నాయి. దీనితో టీవీకే ఎన్నికల చిహ్నం చాలా వేగంగా జనాలలోకి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన అధికార డీఎంకే చెన్నైలోని చెపాక్ స్టేడియంలోకి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా విజిల్ ను బ్యాన్ చేసింది. స్టేడియంలో విజిల్స్ మోత టీవీల్లో ప్రసారమై టీవీకే ఉచితంగా ప్రచారం లభిస్తుందని భావించడం వల్లనే విజిల్స్ పై స్టేడియంలో అనధికార బ్యాన్ విధించిందని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఫిష్యాక్ స్టేడియంలోకి విజిల్స్ కు అనుమతి లేదంటూ నిర్వాహకులు నిబంధన పెట్టారని అంటున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird