Home Latest News సిట్ విచారణ సందర్బంగా కేసీఆర్ భావోద్వేగం | కేసీఆర్ సిట్ విచారణ| ఫోన్ ట్యాపింగ్ కేసు| హైదరాబాద్ నందినగర్| BRS పార్టీ| కేటీఆర్| కవిత| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| న్యాయవాది రామచంద్రరావు – Andhra Waves

సిట్ విచారణ సందర్బంగా కేసీఆర్ భావోద్వేగం | కేసీఆర్ సిట్ విచారణ| ఫోన్ ట్యాపింగ్ కేసు| హైదరాబాద్ నందినగర్| BRS పార్టీ| కేటీఆర్| కవిత| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| న్యాయవాది రామచంద్రరావు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


సిట్ విచారణ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురైందని సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా. తెలంగాణ ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు. స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఎంతో మందితో చర్చలు జరిపా..ఈ గదిలోనే రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశా..ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం అన్నట్లు.

మరోవైపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. మాజీ సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు మహిళా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనతో హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది.

నల్ల జెండాలతో మంత్రుల క్వార్టర్స్‌ను ముట్టడించిన బీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు.. ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ నిరసనకు దిగారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, తుంగ బాలను అదుపులోకి తీసుకున్నారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ అధినేత సిట్‌ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల బీఆర్‌ఎస్‌ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird