పోస్ట్ చేయబడింది జనవరి 23, 2026 2:26PM

తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏసీబీ కోర్టులో సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చగా, మరో 12 మందిని ఇందులో చేరుస్తూ ఇవాళ అభియోగపత్రం దాఖలు చేసింది. ఛార్జీషీట్‌లో 11 మంది టీటీడీ ఉద్యోగులు, మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పీఏ చిన్నఅప్పన్న సహా ఏఆర్ డెయిరీ, భోలేబాబా డెయిరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి.
గత హయాంలో టీటీడీ వైసీపీడూల్లో వినియోగించిన నెయ్యి కల్తీ అయిందని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌పై అభ్యంతరాలు రావడంతో సీబీఐ అధికారులు ఎంక్వైరీని కొనసాగించారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ సాగింది. మొత్తం 24 మంది నిందితులను పేర్కొన్నారు. విచారణ ముగియడంతో తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టులో సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసింది.
.webp)