Home Latest News మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే? | మిథున్‌రెడ్డి బీజేపీలోకి రావడానికి కారణం. కాషాయం| పార్టీ – Andhra Waves

మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే? | మిథున్‌రెడ్డి బీజేపీలోకి రావడానికి కారణం. కాషాయం| పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే? | మిథున్‌రెడ్డి బీజేపీలోకి రావడానికి కారణం. కాషాయం| పార్టీ


పోస్ట్ చేయబడింది జనవరి 18, 2026 9:42PM


వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయ’సాయిరెడ్డి కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెడతారా అంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు.

అది పక్కన పెడితే మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ఆటంకమేంటి? అన్న చర్చ ఆరంభమైంది. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మధ్య 500 భాగాలుపైగా ఆస్తులు పెరుగుదల ఏమంత సులువుగా జరగలేదు. జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడు మిథున్ రెడ్డి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో ఆయన కేబినెట్‌లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు. భారీ ఎత్తున భూక‌బ్జాలు, అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌లు, ఆపై ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి కార్య‌క‌లాపాలు య‌ధేచ్చ‌గా సాగాయ‌నీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయ‌లు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకుతున్నదని పరిశీలకులు అంటున్నారు.

అవినీతి మరక అడ్డం బీజేపీ ఎంట్రీకి గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబందాలు ఉండకూడదు. లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడదు. ఈ కండిషన్స్ కారణంగానే మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు.

ఇప్ప‌టికే వైసీపీలో కొంద‌రు సీనియ‌ర్లు.. సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అలాంటి వారితో క‌ల‌సి మిథున్ బీజేపీలోకి వ‌స్తే.. ఏపీలో కూడా పార్టీ బ‌ల‌ప‌డుతుంది. కాబట్టి.. అలా చేయిగితే త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని కేంద్ర క‌మ‌ల‌నాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. దీనితో ఇటు మిథున్ తో పాటు అటు విజ‌య‌సాయి కూడా ఇలాంటి క‌మ‌లం బాట ప‌ట్టే వారి కోసం తీవ్రంగా య‌త్నిస్తున్నార‌ట‌. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండిషన్లన్నిటినీ నెరవేర్చి మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు 2029 ఎన్నికలు కూడా వచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird