Home Latest News సుప్రీం ప్రకారం సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్ | పిన్నెల్లి సోదరుల రిమాండ్| పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి| మాచర్ల| ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల హత్య కేసు| గుండ్లపాడు| జ్యుడీషియల్ రిమాండ్| YSRCP MLA| సుప్రీం కోర్ట్ – Andhra Waves

సుప్రీం ప్రకారం సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్ | పిన్నెల్లి సోదరుల రిమాండ్| పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి| మాచర్ల| ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల హత్య కేసు| గుండ్లపాడు| జ్యుడీషియల్ రిమాండ్| YSRCP MLA| సుప్రీం కోర్ట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
సుప్రీం ప్రకారం సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్ | పిన్నెల్లి సోదరుల రిమాండ్| పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి| మాచర్ల| ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల హత్య కేసు| గుండ్లపాడు| జ్యుడీషియల్ రిమాండ్| YSRCP MLA| సుప్రీం కోర్ట్


డిసెంబర్ 11, 2025 6:47PMన పోస్ట్ చేయబడింది


మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం (ఈ నెల11న) మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నె సోదరులు లొంగిపోయారు.ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి దారుణ వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు పాల్పడ్డారు.

తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird