Home సినిమా ఇండియా ఫ్యాన్.. ఫ్రమ్ న్యూజిలాండ్ – iDreamPost – Andhra Waves

ఇండియా ఫ్యాన్.. ఫ్రమ్ న్యూజిలాండ్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఇండియా ఫ్యాన్.. ఫ్రమ్ న్యూజిలాండ్ - iDreamPost


క్రికెట్ అంటే కొందరికి ఆట.. మరికొందరికి వినోదం. కానీ ఓ 78 ఏళ్ల వ్యక్తికి మాత్రం క్రికెట్ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అదీ తన దేశ జట్టుపై కాకుండా భారత క్రికెట్ జట్టుపై ప్రత్యేక అభిమానం పెంచుకోవడం విశేషం. న్యూజిలాండ్‌కు చెందిన ఆంథోనీ బ్రౌన్ దాదాపు 58 ఏళ్లుగా తమ దేశంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూస్తున్నారు. భారత క్రికెట్‌తో ఆయనకున్న అనుబంధం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

1968లో మన్‌సూర్ అలీ ఖాన్ పటౌడీ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్‌లో విడుదలైనప్పుడు ఆంథోనీ బ్రౌన్ తొలిసారిగా మ్యాచ్ చూశారు. అప్పట్లో ఆయన కాలేజీ విద్యార్థి. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌తో మొదలైన ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ పర్యటనలో డునెడిన్ వేదికగా భారత్ చరిత్రాత్మక విజయం. ఉపఖండం వెలుపలకు అదే తొలి విజయం. అయితే 1976లో వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌ను బ్రౌన్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తీవ్రమైన చలిగాలుల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో భారత క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ బౌలింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారట. దాదాపు రెండు ఉష్ణోగ్రతలలో బౌలింగ్ చేసిన ఆయనను ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని బ్రౌన్ గుర్తుచేసుకున్నారు.

1981లో రవిశాస్త్రి ఆరంగేట్రం చేసిన మ్యాచ్‌నూ ఆయన ప్రత్యక్షంగా చూశారు. అలాగే సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీలకు సాక్షిగా నిలిచారు. అయితే తనకు అత్యంత గుర్తుండిపోయిన ఇన్నింగ్స్ మాత్రం అజింక్య రహానేదేనని చెప్పారు. వెల్లింగ్టన్‌లో రహానే ఆడిన అద్భుతమైన సెంచరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని వివరించారు. బ్రౌన్ గతంలో న్యూజిలాండ్ దౌత్యవేత్తగా పనిచేశారు. చైనాలో తమ రాయబారిగా కూడా సేవలందించారు. ఒకప్పుడు భారత్‌లో హైకమిషనర్‌గా పనిచేసే అవకాశం వచ్చినా కుటుంబ పరిస్థితుల కారణంగా అంగీకరించలేకపోయారు. ఆ వదులుకోవడంపై ఇప్పటికీ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తికరంగా బ్రౌన్ కుటుంబ మూలాలు కూడా భారత్‌తో ముడిపడి ఉన్నాయి. ఆయన పూర్వీకులు 1850వ దశకంలో కోల్‌కతా నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. ప్రస్తుతం తన కుటుంబ చరిత్రను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పటౌడీ నుంచి కోహ్లీ వరకు ఎన్నో తరాల భారత క్రికెటర్ల ఆటను చూసిన బ్రౌన్.. క్రికెట్‌పై అభిమానం దేశాల సరిహద్దులను దాటుతుందని నిరూపిస్తున్నారు.

రచయిత అవతార్

సయ్యద్ నాగ్ పాషా

నా పేరు సయ్యద్‌ నాగ్‌పాషా. iDreamPost.comలో చీఫ్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ డెస్క్ వర్క్‌తో పాటు రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, హెల్త్, లైఫ్ స్టైల్, క్రికెట్‌కు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ కంటెంట్ కూడా రాస్తుంటాను. జర్నలిజం వృతిలోకి 2018లో వచ్చాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి జర్నలిజం స్కూల్ నుంచి ఈ జర్నీ మొదలైంది. ఆ తర్వాత సాక్షి వెబ్‌సైట్‌, ఖమ్మం యూనిట్‌ ఆఫీస్‌, సుమన్‌ టీవీ, టీవీ9 డిజిటల్‌లో సేవలు అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird