Home సినిమా వాట్సాప్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ – iDreamPost – Andhra Waves

వాట్సాప్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
వాట్సాప్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ - iDreamPost


మీరు ఆఫీసులో లేదా సైబర్ కేఫ్‌లో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్‌సైట్‌లో ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం మీ పర్సనల్ మెసేజులను ఇతరుల చేతుల్లోకి వెళ్లేలా చేయొచ్చు. అంతేకాదు.. మీ వాట్సాప్ అకౌంటును ఉపయోగించి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర డబ్బులు అడిగిన వారికి మోసాలకు ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాట్సాప్ వెబ్‌సైట్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరుగుతుంది? మన అకౌంటును ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? వివరంగా తెలుసుకుందాం.

చాలామంది ఆఫీసు కంప్యూటర్లు, ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్‌లు లేదా సైబర్ కేఫ్‌లలోని కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తుంటారు. పని పూర్తయ్యాక బ్రౌజర్ ట్యాబ్‌ను మూసేసి వెళ్లిపోతారు. అయితే ఇక్కడే సమస్య మొదలవుతుంది. కేవలం ట్యాబ్ లేదా బ్రౌజర్ విండో మూసివేసినంత మాత్రాన వాట్సాప్ ఖాతా నుంచి లాగౌట్ అయినట్లు కాదు. ఆ కంప్యూటర్‌లో మీ లాగిన్ సెషన్ అలాగే ఉండిపోతే.. తర్వాత ఆ సిస్టమ్‌ను ఉపయోగించే వ్యక్తి మీ అకౌంటును తెరిచే అవకాశం ఉంటుంది. అలా మీ పర్సనల్ చాట్స్ చదవడం, మీ ఇతరులకు మెసేజులు పంపడం వంటి పనులు చేయవచ్చు.

ఈ సమస్య కేవలం పర్సనల్ మెసేజులకు మాత్రమే పరిమితం కాదు. మీ వాట్సాప్ అకౌంటును మరొకరు తమ ఆధీనంలోకి తీసుకుంటే.. మీ స్నేహితులు, బంధువులకు మీ పేరుతో మెసేజ్‌లు పంపవచ్చు. అత్యవసరంగా డబ్బులు కావాలని అడగవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి నుంచే మెసేజ్ వచ్చిందని నమ్మి వారికి డబ్బులు పంపే ప్రమాదం ఉంది. ఇలా మీ అకౌంటును ఉపయోగించి ఇతరులను మోసం చేయవచ్చు. అందుకే వాట్సాప్ వెబ్ లాగిన్ సెషన్‌ను నిర్లక్ష్యంగా వదిలేయొద్దని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరిస్తోంది.

సైబర్ కేఫ్‌లు, ఇతరుల కంప్యూటర్లలో జాగ్రత్త
సైబర్ కేఫ్‌లు, హోటళ్ల బిజినెస్ సెంటర్‌లు, ఇతరుల కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌లో లాగిన్ చేయకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా సమాచారం, ఆర్థిక సమాచారం, కార్యాలయానికి సంబంధించిన రహస్య పత్రాలు వంటి సున్నితమైన వివరాలను వాట్సాప్ వెబ్ ద్వారా పంచుకోవద్దని సూచించింది. తప్పనిసరిగా ఇతర కంప్యూటర్‌లో ఉపయోగించాల్సి వస్తే.. నమ్మకమైన సిస్టమ్‌నే ఎంచుకోవాలి. అందుబాటులో ఉంటే ఇన్ కాగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉపయోగించాలి. అయితే ఈ మోడ్ వాడినంత మాత్రాన పూర్తి భద్రత లభించదు. పని పూర్తయ్యాక ఖాతా నుంచి తప్పనిసరిగా లాగౌట్ కావాలి.

ట్యాబ్ మూసేస్తే సరిపోదు
వాట్సాప్ వెబ్ ఉపయోగించిన తర్వాత బ్రౌజర్ ట్యాబ్ మూసేయడం కాకుండా.. ముందుగా ఖాతా నుంచి మాన్యువల్‌గా లాగౌట్ కావాలి. కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ తెరిచి, మెనూలోని లాగౌట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి లింక్డ్‌కి వెళ్లండి. అక్కడ మీ అకౌంటుకు అనుసంధానమైన పరికరాల వివరాలు కనిపిస్తాయి. మీకు తెలియని పరికరం కనిపిస్తే వెంటనే లాగౌట్ చేయండి. కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద ఫైల్స్, తెలియని డౌన్‌లోడ్‌లు, క్రాక్ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండాలి.

ఖాతా హ్యాక్ అయినట్లు అనిపిస్తే ఏం చేయాలి?
మీరు పంపని మెసేజ్‌లు మీ ఖాతా నుంచి వెళ్తున్నారా? మీ స్నేహితులు మీ పేరుతో అనుమానాస్పద సందేశాలు వస్తున్నాయని చెబుతున్నారా? అయితే వెంటనే అప్రమత్తం కావాలి. మీ ఫోన్‌లో లింక్ డివైజెస్ విభాగాన్ని తెరిచి, అనుమానాస్పద పరికరాల నుండి లాగౌట్ చేయండి. మీ అకౌంట్ సేఫ్టీని పరిశీలించండి. అలాగే మీ పేరుతో డబ్బులు అడిగే మెసేజులు వస్తే.. వాటిని నమ్మి డబ్బులు పంపొద్దని మీ పరిచయస్తులకు తెలియజేయండి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

మొత్తానికి వాట్సాప్ వెబ్ ఉపయోగించడం తప్పు కాదు. కానీ ఇతరుల కంప్యూటర్లలో లాగిన్ చేసి లాగౌట్ చేయకుండా వదిలేయడమే ప్రమాదకరం. కేవలం ట్యాబ్ మూసేయడం సరిపోదు.. ప్రతిసారీ మాన్యువల్‌గా లాగౌట్ కావడం అలవాటు చేసుకోండి. చిన్న జాగ్రత్త మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితుల డబ్బును కాపాడుతుంది. ఈ విషయాలను మీ కుటుంబ సభ్యులు, మీతో కూడా పంచుకోండి.

మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird