
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో టెక్ దిగ్గజాల భారీ పెట్టుబడుల మధ్య ప్రముఖ నటుడు మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో ఎమ్మెల్యే కుదుర్చుకున్నారు. దేశీయ సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆమెకు నమస్తే వరల్డ్ స్టార్టప్ తరపున ఆమె ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సదస్సులో భాగంగా భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలో జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కర్నూలు ముందుకు వచ్చారు. 36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చక్కటి హస్తకళల ఉత్పత్తులు, సాంప్రదాయ ఆటవస్తువుల తయారీని ఈ యూనిట్ ద్వారా మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు, సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రధాన ఉద్దేశ్యంతో ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ తన సతీమణితో కలిసి ఉన్నారు. సదస్సుకు విచ్చేసిన మంత్రులు మరియు పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా భూమా దంపతులను అభినందించారు. స్థానిక చేతివృత్తుల వారిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఈ తరహా స్టార్టప్‌లు యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తినిస్తాయి.

ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే కర్నూలు ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ముఖ్యంగా స్థానిక కళాకారులు, చేనేత మరియు హస్తకళల నిపుణులకు మెరుగైన ఉపాధి దొరుకుతుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో కోకో సాగుకు కొత్త ఊపు.. మాండెలేజ్‌తో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన.!
దేశీయ విఫణిలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఇలాంటి వినత్న స్టార్టప్‌లు ముందుకు రావడానికి మార్గం సుగమమైందంటున్నారు.

రాజకీయంగా చూస్తే, నంద్యాల ప్రాంతంతో బలమైన నేపథ్యం ఉన్న భూమా కుటుంబం నుంచి మౌనిక పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం విశేషం. ఆమె సోదరి భూమా అఖిలప్రియ ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, భూమా మౌనిక వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు.
మీకు నచ్చవచ్చు: ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక ప్రారంభంపై చర్చ.!
ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!
[Bhuma Mounika, MoU, Vizag Summit, Namaste World, Handicrafts, TeluguOne]
