పాకిస్థాన్ క్రికెట్ స్టార్ బాబర్ అజామ్‌కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఫామ్ కోల్పోయి డొమెస్టిక్ సిరుకెట్ ఆడుతుంటే అక్కడ కూడా ఫ్లాప్ అయ్యాడు. క్వాయిడ్-ఎ-అజమ్ ట్రోఫీలో ఫాటా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ వైట్స్ తరపున బరిలోకి దిగిన బాబర్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 28, 42 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయిన తర్వాత తీవ్ర నిరాశకు గురైన బాబర్.. తన బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ రెండో మ్యాచ్‌లో బాబర్ 77 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఫాటా బౌలర్ షాహిద్ అజీజ్ వేసిన బంతిని ఆడే వికెట్ కోల్పోయాడు. లెంగ్త్‌లో పడిన బంతి స్వింగ్ అవుతూ బయటకు వెళ్లగా, దానిని వదిలేయాల్సిన బాబర్ అనవసరంగా ఆడాడు. దీంతో బ్యాట్ అంచుకు తగిలిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశకు గురైన పాక్ స్టార్ పెవిలియన్‌కు వెళ్తూ తన అసహనాన్ని ప్రదర్శించి బ్యాట్ కిందకేసి గట్టిగా కొట్టాడు. దీంతో ఈ పాక్ స్టార్ పై విమర్శలు వస్తున్నాయి.
నవంబర్ 9 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ రెండుల సిరీస్ ప్రారంభం. రావల్పిండిలో జరిగే తొలి పాటలకు ముందు బాబర్‌కు ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యం. దేశీయ క్రికెట్లోనూ పరుగులు చేయలేకపోయిన బాబర్.. అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. పాక్ జట్టుకు కీలకమైన బాబర్ తిరిగి తన పాత ఫామ్‌ను అందుకుంటాడో లేదో చూడాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఫాటా రీజియన్ తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు చేసింది. ఫవాద్ అర్షద్ 311 బంతుల్లో 115 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లాహోర్ వైట్స్ 234 పరుగులకే ఆలౌటైంది. అలీ జర్యాబ్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫాటా బ్యాటర్లు సత్తా చాటారు. మహమ్మద్ ఫరూఖ్ 191 బంతుల్లో 123 పరుగులతో అద్భుతమైన శతకం సాధించడంతో ఆ జట్టు 283 పరుగులు చేసింది.
దీనితో లాహోర్ వైట్స్ ముందు భారీ లక్ష్యం. అయితే, లక్ష్య ఛేదనలో లాహోర్ జట్టు మరోసారి తడబడింది. కేవలం 170 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాటా 241 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జైన్ బిన్ ఫరూఖ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
The post బాబర్ అజామ్ ఓవరాక్షన్.. విమర్శలు appeared first on iDreamPost.
