Home సినిమా 800 కోట్ల క్లబ్‌లో ‘జైలర్ 2’: కోలీవుడ్ 1000 కోట్ల కల నెరవేరుతుందా.? – Andhra Waves

800 కోట్ల క్లబ్‌లో ‘జైలర్ 2’: కోలీవుడ్ 1000 కోట్ల కల నెరవేరుతుందా.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలైన 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల మార్క్‌కు చేరుకుంది. ఇప్పటికే రజినీకాంత్ గత చిత్రం ‘2.0’ రికార్డును కూడా అధిగమించి.. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

ముఖ్యంగా 17వ రోజు కలెక్షన్లలో ఈ సినిమా మంచి జోరు చూపించింది. శనివారం ఒక్కరోజే ఇండియాలో రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. శుక్రవారం వచ్చిన రూ.5.50 కోట్లతో దాదాపు 70 శాతం వృద్ధి కనిపించడం విశేషం.

ఇండియాలో ఈ సినిమా మొత్తం రూ.444.75 కోట్ల నెట్, రూ.520.35 కోట్ల గ్రాస్ ఉండటంతో 17 వసూళ్లను గుర్తించారు. ఓవర్సీస్‌లో రూ.270.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.790.85 కోట్లకు చేరుకున్నాయి. అంటే రూ.800 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడానికి మరో రూ.9.15 కోట్లు మాత్రమే అవసరం.

మొత్తానికి ‘జైలర్ 2’ ఇప్పుడు రూ.800 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఈ మైలురాయిని అందుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ సినిమాగా అరుదైన రికార్డు సృష్టించనుంది.

ఇదే జోరు కొనసాగితే ‘జైలర్ 2’ మూవీ ఫుల్ రన్‌లో రూ.1000 కోట్ల మార్క్‌కు చేరువైనా ఆశ్చర్యం లేదు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు పది సినిమాలు మాత్రమే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. అందులో తెలుగు, హిందీ, కన్నడ సినిమాలు ఉండగా.. తమిళ్ కి ఆ టార్గెట్ అందని ద్రాక్షలా మారింది. ఇప్పుడు ‘జైలర్ 2’ ఆ మార్క్‌ను అందుకుంటే హిస్టరీ అవుతుంది.

ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ.!

[Jailer 2 800 Crore Club, Jailer 2 Day 17 Collection, Jailer 2 Box Office Collection, Jailer 2 1000 Crore Club, Jailer 2 Worldwide Gross, Jailer 2 Movie, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird