హీరోయిన్ కృతి సనన్ జ్యువెలరీ యాడ్ వివాదంపై మరోసారి స్పందించారు. ఈ వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని ఆమె హితవు పలికారు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘వాట్ విమెన్ వాంట్’లో కృతి సనన్ ఉంటుంది. షోలో కృతి ఆ ఘటనను గుర్తుచేసుకుంటూ..
”కేవలం నా చోలీ దేశంలో ఒక జాతీయ చర్చగా మారుతుందని నేను అస్సలు ఊహించలేదు. ప్రైమ్-టైమ్ న్యూస్ ఛానళ్లలో ఆరుగురు కూర్చుని నా బట్టల గురించి ప్యానెల్ డిస్కషన్స్ చేస్తుంటే నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. సాధారణంగా నేను ట్రోల్స్‌ను పట్టించుకోను. ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నాను. కానీ, ఈ వివాదం నా వ్యక్తిగత విషయానికి సంబంధించినది కాదు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షకు అద్దం పడుతోంది. ప్రతి చిన్న విషయానికి మహిళలను మాత్రమే టార్గెట్ చేస్తారు. బట్టలు నచ్చాయా లేదా అని అభిప్రాయం చెప్పడం వేరు.
కానీ, దాని పేరుతో విపరీతమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదు. సోషల్ మీడియాలో సంస్కృతి, గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారే.. ఐరానికల్‌గా నా తల్లిదండ్రులు, సోదరి అకౌంట్లలోకి వెళ్లి అత్యంత అసభ్యకరమైన, కించపరిచే భాషలో కామెంట్లు పెట్టారు. మహిళలపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు తమ కోసం తాము గళం విప్పడం చాలా ముఖ్యం. మహిళలు నిజంగా కోరుకునేది. ఎవరూ తమను జడ్జ్ చేయకూడదు. ఇతరులు వారి పని వారు చూసుకుంటే చాలు” అని కృతి సనన్ ముగించారు.

