Home Latest News నేపాల్ ప్రకృతి విపత్తు : నేపాల్‌ను వెంటాడుతున్న శాపం.. – Andhra Waves

నేపాల్ ప్రకృతి విపత్తు : నేపాల్‌ను వెంటాడుతున్న శాపం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


నేపాల్ ప్రకృతి విపత్తు : మన పొరుగు దేశం నేపాల్‌లో ఐదు రోజుల క్రితం ప్రకృతి ప్రకోపించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా.. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా బురదతో కూడిన వరద విరుచుకుపడింది. 2014 భూకంపానికి మించిన నష్టం కలిగించింది. వేలాది మందిని కబళించింది. లెక్కలేనంత మంది గల్లంతయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలకు కారణం చైనా అన్న అభిప్రాయం సగటు నేపాలీల్లో వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. […]

నేపాల్ ప్రకృతి విపత్తు : మన పొరుగు దేశం నేపాల్‌లో ఐదు రోజుల క్రితం ప్రకృతి ప్రకోపించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా.. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా బురదతో కూడిన వరద విరుచుకుపడింది. 2014 భూకంపానికి మించిన నష్టం కలిగించింది. వేలాది మందిని కబళించింది. లెక్కలేనంత మంది గల్లంతయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలకు కారణం చైనా అన్న అభిప్రాయం సగటు నేపాలీల్లో వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ చైనాకు సంబంధం లేదు అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనేపాల్‌కు సంబంధించిన ఒక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ శాపమే ఆ దేశంలో ప్రకృతి విధ్వంసానికి కారణంగా చెప్పబడుతోంది.

ఏంట కథ..?
17వ శతాబ్దంలో ఖాట్మండు లోయను పాలించిన మల్ల వంశ రాజుల కాలంలో అధికార పోరాటాలు సర్వసాధారణం. రాజు లక్ష్మీనరసింహ మల్ల సేవలో ఉన్న సేనాపతి భీమ్‌ మల్లా సైనికుడు, పరిపాలనా, వాణిజ్య వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడు. పెరుగుతున్న ఇతని ప్రభావం ఇతర సామంతుల్లో అసూయకు దారితీసింది. చాడీలు, అపోహలు రాజు మనసులో సందేహాలు నింపాయి. ఫలితంగా ఎలాంటి సరైన విచారణ లేకుండానే భీమ్ మల్లాకు మరణశిక్ష విధించబడింది.

భీమ్‌ మల్లా భార్య ఆత్మాహుతి..
భర్తను అన్యాయంగా ఉరితీయడాన్ని సహించలేక భువనలక్ష్మి నాటి సతి ఆచారం ప్రకారం చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఆ సమయంలో ఆమె రాజ్యం, నేలపై తీవ్ర కోపంతో శాపం పెట్టిందని జానపద కథనం చెబుతుంది. మనశ్శాంతి లేకుండా, విధ్వంసం ఎదురవుతుందని ఆమె అన్నట్లు ప్రచారం. రాజు తర్వాత పశ్చాత్తాపం చెందాడని, ఆ కాలంలోనే కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించాయని కథలు చెప్పుకుంటారు. ఈ సంఘటన నుంచే సతి లే సరాపేకో దేశం’ అనే పదబంధం పుట్టుకొచ్చిందంటారు.

ఇప్పటికీ వెంటాడుతుందా..
రాజరికం అంతమైన తర్వాత, ప్రభుత్వాలు తరచుగా కూలిపోయిన సందర్భాల్లో, రాజకీయ అస్థిరత తీవ్రమైనప్పుడు ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకృతి ప్రకోపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం, భూకంపాలు సంభవించినప్పుడు కూడా ప్రజలు దీనిని గుర్తుచేసుకుంటారు. ఇది కేవలం చారిత్రక స్మృతి కాదు.. నేటి వ్యంగ్యంగా, ఆవేదనతో వ్యక్తీకరించే సాధనంగా మారింది. తాజాగా జల విపత్తు మళ్లీ ఈ గాథను తెరపైకి తీసుకొచ్చింది.

ఈ కథ నేపాల్‌లో అన్యాయం, కుట్రలు, అధికార దుర్వినియోగంపై ఉన్న సామూహిక జ్ఞాపకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రకృతి విపత్తులు, రాజకీయ సంక్షోభాలు కలిసి వచ్చినప్పుడు ప్రజలు చారిత్రక శాపాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు నేపాల్‌ ప్రజలు ఇలాంటి కష్టాలను అలవాటు చేసుకుని తిరిగి నిలబడగలరని నమ్మకం వ్యక్తం చేశారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird