గోల్డెన్ అవర్‌లో గోల్డెన్ సర్వీస్..
108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం..
ఏపీలో పాలనలో అభివృద్ధి, సంక్షేమ కూటమి పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీస్‌లూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి. ప్రతి ప్రాణ నిమిషం రక్షణ కోసం అత్యవసర సేవలు అందించబడతాయి. భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అంబులెన్స్ లకు టెక్నాలజీ జోడించిన బాధితులను గోల్డెన్ అవర్ లో ఆస్పత్రులకు చేర్చారు. 2025 జూన్ నుంచి 2026 మే వరకు ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,78,799 అత్యవసర కేసులకు స్పందించి వేలాది కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగించారు.
ప్రాణాపాయ స్థితిలో దేవుడిలా 108 సాయం
ఈ ఏడాది కాలంలో 1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు 108 మంది సిబ్బంది గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య సహాయం అందించారు. అలాగే 1,05,786 మంది గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించి తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. 97,118 శ్వాసకోశ సమస్యల కేసుల్లో తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడారు.
అదేవిధంగా 49,342 వాహనేతర గాయాల కేసులు, 45,951 గుండెజబ్బుల కేసులు, 40,553 స్పృహ తప్పిన కేసులు, 34,532 కడుపునొప్పి కేసులు, 32,858 విషప్రయోగ కేసులు, 29,485 ఫిట్స్, 27,455 తీవ్ర జ్వరం కేసులు, 20,271, 20,241 14,088 జంతువుల కాటు కేసులు, 14,007 నవజాత శిశువుల అత్యవసర కేసులతో పాటు మరో 1,38,141 ఇతర అత్యవసర కేసుల్లో 108 సిబ్బంది అంకితభావంతో సేవలందించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ మొత్తం సేవల్లో 2,53,022 కేసులు ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించబడిన అంతర్గత బదిలీలు (IFT) కాగా, 5,25,777 కేసులు నేరుగా ప్రమాదాలు మరియు అత్యవసర ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలించబడిన కేసులు నాన్-IFTగా నమోదయ్యాయి.
గుండె పోటు వంటి ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాధారంగా 108
ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకంగా మారే గుండెజబ్బుల అత్యవసర కేసుల్లో 108 అంబులెన్స్ 108 సిబ్బంది దేవుడిలా మారి, సకాలంలో సర్వీస్ అందిస్తూ ఎవరికో పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఏడాదిలో 45,951 గుండెజబ్బుల కేసులకు స్పందించి సకాలంలో వైద్య సహాయం అందించారు. దీనితో పాటు ఛాతినొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు వంటి అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రులకు చికిత్స అందించారు.
అత్యాధునిక వైద్య పరికరాలు, శిక్షణ పొందిన EMTలు మరియు సమర్థవంతమైన అంబులెన్స్ నిర్వహణతో వేలాది ప్రాణాలను కాపాడడంలో 108 సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆపద సమయంలో రోగికి వైద్య సహాయం అందే వరకు EMTలు అందించే సేవలు ప్రాణరక్షణలో కీలకంగా మారుతున్నాయి. వారి సమయస్ఫూర్తి, నైపుణ్యం, సేవాభావం వల్ల వేలాది మంది ప్రాణాలు నిలిచాయి.
ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా సేవలు
ఈ సందర్భంగా భవ్య హెల్త్ కేర్ మీడియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ…ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అత్యవసర వైద్య సహాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికత, నిరంతర నిఘా వ్యవస్థలు మరియు నైపుణ్యం కలిగిన సిబ్బందితో 108 సేవలను మరింత మెరుగుపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మరింత సమర్థవంతమైన సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
108 పనితీరుపై సర్వత్రా హర్షం
ప్రమాదాలు, గుండెపోటు, ప్రసవాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో చేరుకుని వైద్య సహాయం అందించడం ద్వారా 108 సేవలు ప్రజారోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. 108 అంబులెన్స్ సేవలపై బాధితులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే 108 సేవలు అనేక కుటుంబాలకు ఆపద్బాంధవంగా నిలుస్తున్నాయని ప్రజలు అభినందిస్తున్నారు. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్ కాల్‌తో స్పందించి బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది సేవాభావాన్ని కొనియాడుతున్నారు.
.webp)