అభిమానుల, మూవీ లవర్స్ సుదీర్గ నిరీక్షణకి తెరదించుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అండ్ టీం పెద్ది'(పెద్ది) తో జూన్ 4న వరల్డ్ వైడ్ గా ల్యాండ్. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకలని విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తోంది.
ప్రెజెంట్ జరుగుతున్న ఈ వేడుకకి మెగా అభిమానులు, సినిమా ప్రేమికులు భారీ ఎత్తున మద్దతు. స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలన్నీ భారీగా నిండిపోయాయి. కొంత మంది అభిమానులైతే చెట్లు ఎక్కి ఉన్నారు. దీంతో వాళ్ళని కిందకి దింపడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
