హీరోయిన్ గా సుదీర్ఘ కాలం నుంచి సత్తా చాటుతూ వస్తున్న అనుష్క శర్మ(అనుష్క శర్మ)మొన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తన భర్త ఐకాన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(విరాట్ కోహ్లీని ప్రోత్సహించేందుకు స్టేడియానికి వెళ్లిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో అనుష్క శర్మ ధరించిన ఒక లగ్జరీ యాక్సెసరీ వల్ల కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా సెలబ్రిటీల ఫ్యాషన్ స్టైల్, వారు ఉపయోగించే వస్తువులపై నెటిజన్లకి ఆసక్తి ఉంటుంది. ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ చాలా సింపుల్‌గా, ఎంతో స్టైలిష్‌గా ఉండే క్లాసిక్ వైట్ కలర్ టీషర్ట్ మరియు బ్లూ డెనిమ్ జీన్స్ ధరించింది. చూసేందుకు ఎంతో సాధారణంగా కనిపించిన ఈ క్యాజువల్ లుక్‌కు ఆమె జత చేసిన ఒకే ఒక్క లగ్జరీ వస్తువు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆమె చేతికి ధరించిన బంగారు వర్ణపు రిస్ట్ వాచ్ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ఫ్యాషన్ ప్రియులు, నెటిజన్లు ఆ వాచ్ బ్రాండ్ మరియు దాని ధర గురించి ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు ఆ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ అయిన ‘కార్టియర్’ కి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పాంథెర్’ మోడల్ అని తేలింది.
ఈ కార్టియర్ పాంథెర్ వాచ్ కేవలం సమయాన్ని చూపించే వస్తువు మాత్రమే కాదు, అది అంతర్జాతీయంగా ఒక క్లాసిక్ వింటేజ్ లగ్జరీ సింబల్. ప్యూర్ ఎల్లో గోల్డ్ డిజైన్‌తో అద్భుతమైన హస్తకళతో రూపొందించిన ఈ మోడల్ ధర వింటే సామాన్యులకి గుండె గుభేల్ అనడం ఖాయం. ఆ లగ్జరీ వాచ్ విలువ సుమారు రూ.28 లక్షలు.ఒక మధ్యతరగతి కుటుంబం ఐదారేళ్ల పాటు సంపాదించే మొత్తం కేవలం ఒకే ఒక్క చేతి గడియారం రూపంలో ఆమె మణికట్టుపై మెరిసిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ స్థాయి విలాసవంతమైన ధర చూసి నోరెళ్లబెడుతుంటే, మరికొందరు మాత్రం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల రేంజ్, సెలబ్రిటీ హోదాకి 28 లక్షల వాచ్ చాలా సాధారణమైన విషయమే కానని.
also read: sushimitha sen: సుష్మితాసేన్ ఒక గోల్డ్ డిగ్గర్!.. డబ్బు కోసం ఆశపడే రిలేషన్‌లోకి వచ్చింది!
గత ఏడాది ఐపీఎల్ 2025 ఫైనల్స్ సమయంలో కూడా అనుష్క శర్మ సుమారు రూ.48 లక్షల ఖరీదైన రోలెక్స్ డే-డేట్ వాచ్ ధరించి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆమె తన ‘క్వైట్ లగ్జరీ’ ఫ్యాషన్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఈ కార్టియర్ వాచ్‌తో మెరిసింది. తెల్లటి సాధారణ దుస్తులపై ఈ 28 లక్షల బంగారు గడియారాన్ని ధరించి, మినిమాలిస్టిక్ స్టైల్‌లో అల్ట్రా లగ్జరీని ఎలా ప్రదర్శించాలో ఆమె నిరూపించింది. ప్రస్తుతం అనుష్క శర్మకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
