Home సినిమా భేటీకి మమ్మల్ని పిలవలేదంటూ యువ నిర్మాత సంచలనం.. పవన్ ఏమంటారో – Andhra Waves

భేటీకి మమ్మల్ని పిలవలేదంటూ యువ నిర్మాత సంచలనం.. పవన్ ఏమంటారో – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ విధానం’ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)జోక్యంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం, ఆ తర్వాత ఈ సమస్య పూర్తిగా సర్దుమనగడం టాలీవుడ్‌లో పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాతలు హఠాత్తుగా భేటీ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్‌, వృద్ధి సినిమాస్ వెంకట్ సతీష్ కిలారు, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, ఎస్‌ఎల్వీ సినిమాస్ చెరుకూరి సుధాకర్ వంటి బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి పవన్ ని కలిశారు.

ఈ కీలకమైన సమావేశంపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ధీరజ్ కి పవన్ కళ్యాణ్ గారితో జరిగిన నిర్మాతల భేటీ గురించి మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనితో ధీరజ్‌వెంట్‌కి ఆ మీటింగ్‌కి తమలాంటి చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలని ఎవరు పిలవలేదు. కేవలం వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీసే పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రమే పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్)గారిని కలిశారు. మా సమస్యలు మాకు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో 1000 గజాల ప్లాట్ కొనుక్కొని 10 కోట్లతో ఇళ్లు కట్టుకునేవారి సమస్యలు ఉంటాయి. మణికొండలో 250 గజాల ప్లాట్ తీసుకొని ఇళ్లు కట్టుకునేవాడి సమస్యలు వేరే ఉంటాయి. ఇద్దరూ ఇళ్లే కట్టుకుంటున్నా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లకి ఉన్నాయి. అదే విధంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాల సమస్యలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికీ అర్థం కావడం లేదు. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత, ఒక నెల లోపల చిన్న మిడ్ రేంజ్ సినిమాలు తీసే నిర్మాతలందరం చర్చించుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడతామని ధీరజ్ మొగిలినేని అన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైభవానికి ఈటీవీ రెడీ.. త్వరలోనే డేట్ వెల్లడి

ధీరజ్ మొగిలినేని విషయానికి వస్తే ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పై ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ఊర్వశివో రాక్షసీవో, శ్రీరంగ నీతులు వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్ లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ గా మారాడు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird