మొదట ఫ్రెండ్ అన్నాడు.. తర్వాత ప్రేమిస్తున్నాన డు.. నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు నిన్ను చంపేస్తానంటూ దాడి చేస్తున్నాడు అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి విడుదల చేసిన వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రాంపల్లికి చెందిన మనీషా అనే యువతి లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. ఉప్పల్‌కు చెందిన సంతోష్ రెడ్డి ఆమెకు క్లాస్మేట్గా ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో మొదట స్నేహితుడిగా దగ్గరయ్యాడని, అనంతరం ప్రేమ పేరుతో నమ్మించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భారీగా ఉన్నాయని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నానని చెప్పి తనను నమ్మించాడని ఆస్తులు ఉన్నాయి. నువ్వు లేని జీవితం నాకు వద్దు అంటూ ప్రేమ మాటలతో ఒప్పించి ఇండియాకు రప్పించి పెళ్లి చేసుకున్నాడని. ఇరు కుటుంబాల సమక్షంలో 2014లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
వివాహ సమయంలో 40 తులాల బంగారం, ఒక ఫ్లాట్‌ను కట్నంగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు సాఫీగా సాగింది, అనంతరం భర్త సంతోష్ రెడ్డి తనకు తెలియకుండా ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద సుమారు కోటి రూపాయల వరకు అప్పులు తీసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయం బయటపడడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని. నిన్ను అమ్మి నా అప్పులు తీరుస్తాను అంటూ బెదిరించేవారని కూడా ఆరోపించింది.
తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని నిలదీయగా.. నా వెనుక అంబర్‌పేట శంకర్, అతని అనుచరులు ఉన్నారు అంటూ తనను, తన తల్లిదండ్రులను బెదిరించేవాడని మనీషా ఆ వీడియోలో ఆరోపించింది. వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్‌కు రావాలని సూచించినట్లు, సంతోష్ రెడ్డి హాజరు కాలేదని తెలిపారు. ఇటీవల పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా తనపై, తన తల్లిదండ్రులపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారని మనీషా ఆరోపించింది. ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రికి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని మనిషా విజ్ఞప్తి చేస్తూ విడియో విడుదల చేసింది. ఈ ఘటనపై మనీషా తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
