
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ సంపదను కాపాడుకోవాలని సిఎస్ఐ పాఠశాల ఆడిటోరియంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ…పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు, కోట్లు,మసీదులు, పురాతన కట్టడాలు, జానపద కళలు, భాషలు, సాహిత్యం, సంప్రదాయ పండుగలు మన చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నవి.
వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మునిపాల్ ఛైర్పర్సన్ కనుగుల రాధిక భూపతి రాజ్ మాట్లాడుతూ.. తమ సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన పెంచుకొని వాటి పరిరక్షణలో ముందుండాలని సూచించారు.
జిల్లా అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ…పురాతన దేవాలయాలు, శిల్పాలు, చారిత్రక కట్టడాలను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు, కవులు, రచయితలు, జిల్లా ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు.