పూనమ్ కౌర్(పూనమ్ కౌర్)సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఒక రేంజ్‌లో సెన్సేషన్ సృష్టిస్తుంటాయి. నేరుగా ఎవరి పేరుతో ట్వీట్స్ చేయకపోయినా ఆమె చేసే కొన్ని క్రిప్టిక్ ట్వీట్లు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(చంద్రబాబునాయుడు)జనాభా పెంచాలంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ స్పందించారు. ఈ కోరిక ఆమె ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పొలిటికల్ ట్వీట్‌పై ఒక నెటిజన్ గట్టిగా కౌంటర్ ఇస్తూ కామెంట్ చేసాడు.ఆ కామెంట్ చేసిన పర్సన్ డిస్ప్లే పిక్చర్ లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) పిక్ ఉంది.
వెంటనే పూనమ్ కౌర్ ఆ నెటిజన్‌కు రిప్లై ఇస్తూ ‘బావ ఫోటో పెట్టుకున్నావ్’ అనే కామెంట్ చేసింది. పవన్ ని ఉద్దేశించి ఆమె నేరుగా ‘బావ’ అనే పదాన్ని వాడటంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అసలే పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ల మధ్య గతంలో ఎన్నో వివాదాలు, రూమర్లు నడిచిన నేపథ్యంలో ఈ ‘బావ’ కామెంట్ మరింత అగ్గి రాజేసింది. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందించడం. ఈ మేటర్ లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎంటర్ అయ్యి ‘మీకు బావ అనే పదానికి అర్థం తెలుసా? ఆయన మీకు ఎలా బావ అవుతారు?” అంటూ ట్వీట్ చేసాడు
ఇది కూడా చదవండి: Jayam Ravi: జయం రవి నిజస్వరూపం ఇదే.. మీరాచోప్రా సంచలన ట్వీట్
ఆ వైసిపి నేత అడిగిన ప్రశ్నకు పూనమ్ కౌర్ ప్రశ్నిస్తూ.. “కొన్నిసార్లు మనల్ని దారుణంగా ట్రోల్ చేసేవారిని తిరిగి అదే రీతిలో ట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్లు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసే తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. చేస్తున్నాయని, అందుకే తాను ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
