మాళవిక మోహన్(మాళవిక మోహన్)జనవరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(ప్రభాస్)తో రాజాసాబ్ చేసి మెప్పించింది. అందం, పెర్ఫార్మెన్స్ ఒకదానితో ఒకటి పోటీపడేలా నటించడం మాళవిక స్పెషల్. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇళయ దళపతి విజయ్(విజయ్)పై కీలక వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతు ‘మాస్టర్'(మాస్టర్)సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్‌ని మొదటిసారిగా కలిసాను. మొదటి రోజే విజయ్‌తో ఒక క్లిష్టమైన సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. దాంతో డైలాగ్స్ సరిగ్గా కుదురుతాయో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ విజయ్ సర్ మాత్రం చాలా ప్రశాంతంగా, కూల్‌గా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంతటి కష్టమైన సీన్ అయినా సరే.. విజయ్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రతి నిశితంగా గమనించి పూర్తిగా పనిపైనే ఫోకస్ చేస్తారు . తోటి నటినటులకి పూర్తి కంఫర్ట్ ఇస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేస్తే స్వేచ్ఛని విజయ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్: ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్
ఉదయం 7 గంటలకి కాల్షీట్ ఉంటే, విజయ్ సరిగ్గా 6:55 నిమిషాలకే సెట్స్‌లో ప్రత్యక్షమవుతారు. అలాంటి అంకితభావం ఉన్న హీరోల వల్లే నిర్మాతలకు ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సమయం వస్తుంది. విజయ్ లాంటి అద్భుతమైన డాన్సర్‌తో కలిసి ‘మాస్టర్’ సినిమాలో ఒక్క పాటలో కూడా డాన్స్ చేసే అవకాశం రాలేదనే వెలితి మాత్రం అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ 2021లో రాగా చారులత అనే క్యారక్టర్ లో మాళవిక మోహన్ అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించింది.
