-పెద్ది స్పెషల్ సాంగ్ లో ఎవరు
-రంగంలోకి బాలయ్య హీరోయిన్
-నిజమవ్వాలని ఆశపడుతున్న ఫ్యాన్స్
గత కొన్ని రోజులుగా అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో ఎక్కువగా నానుతున్న చర్చల్లో పెద్ది(పెద్ది)స్పేషల్ సాంగ్. ఈ స్పెషల్ సాంగ్ లో రకరకాల హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే ఆ పేర్లన్నీ రూమర్స్ క్యాటగిరిలోనే తమ ప్రస్థానాన్ని ముగించాల్సిన పరిస్థితి. రీసెంట్ గా మరో రూమర్ అదే తీరులో సినీ సర్కిల్స్ లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మరి ఆ న్యూస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
సంయుక్త మీనన్(సంయుక్త మీనన్).. ఒక ఆఫర్ తర్వాత మరో ఆఫర్ రావడానికే టైం పడుతున్న వేళ వెంట సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ పాటికే మీకు అర్ధం అయినట్టు ఉండచ్చు. పెద్ది స్పెషల్ సాంగ్ లో సంయుక్త మీనన్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయని. అవును. ఇప్పుడు ఈ న్యూస్ జనరల్ గా సోమవారం రోజు డల్ గా ఉండే వాతావరణంలో జోష్ ని తీసుకొచ్చింది. ఆ న్యూస్ చూస్తున్న ఫ్యాన్స్ అయితే అది నిజమవ్వాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళతో పాటు అందరికి తెలిసిన నిజం ఏంటంటే ఈ ఆఫర్ సంయుక్త మీనన్ కి వస్తే అసలు వదులుకోదు.
అస్లో చదవండి: VIjay Deverakonda: విజయ్ దేవరకొండకి నా తర్వాతనే రష్మిక.. వైరల్ అవుతున్న ప్రముఖ నటి కామెంట్స్
‘భీమ్లా నాయక్’,తో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ . అఖండ 2 వంటి వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ హోదాలో కొనసాగుతుంది. ప్రస్తుతం సోలో క్యారక్టర్ లో బ్లాక్ గోల్డ్ తో పాటు నిఖిల్ స్వయంభులో చేస్తుంది.

