Home సినిమా జయం రవి విడాకుల విషయంలో ట్విస్ట్.. 4వ తరగతిలోనే శృంగారభరితంగా వేధించారు – Andhra Waves

జయం రవి విడాకుల విషయంలో ట్విస్ట్.. 4వ తరగతిలోనే శృంగారభరితంగా వేధించారు – Andhra Waves

by
0 comments
జయం రవి విడాకుల విషయంలో ట్విస్ట్.. 4వ తరగతిలోనే శృంగారభరితంగా వేధించారు


ప్రముఖ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వైవాహిక బంధం ముగిసిపోవడానికి ప్రముఖ పాప్ సింగర్, స్పిరిచువల్ థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ కారణమంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది కేనిషాని విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా కేనిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భావోద్వేగంతో మాట్లాడటం నేను 2013 సంవత్సరంలో తల్లిని, 2017లో తండ్రిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాను. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే నాలుగో తరగతి చదువుతున్న వయసులోనే సొంత బంధువుల నుండి వేధింపులను ఎదుర్కొన్నాను. కేవలం 18 ఏళ్లకే,జీవితంపై కనీస అవగాహన లేని వయసులో పెళ్లి చేసుకోవడం వలన తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకి లోనయ్యి గర్భంలోనే బిడ్డను కూడా కోల్పోయాను. జీవితంలో ఇంతటి భయంకరమైన పెయిన్ అనుభవించిన నేను , ఒక తండ్రిని తన పిల్లల నుండి, ఒక అందమైన కుటుంబాన్ని వేరుగా చూస్తానా.

ఇది కూడా చదవండి: సమంత: తెలివిగా తప్పించుకున్న సమంత.. కానీ చరణ్ వల్ల సమస్య తప్పదా!

రవి ఏమైనా చిన్న పిల్లాడా, ఎవరితో మాట్లాడాలి, ఎలా బతుకులో ఆయనకి తెలియదా రవి తన వైవాహిక జీవితంలో తీవ్రమైన మానసిక వేధింపులకి గురై, ఎమోషనల్‌గా పూర్తిగా కుంగిపోయిన సమయంలో ఒక థెరపిస్ట్‌గా మాత్రమే నన్ను సంప్రదించాడు. మొదట్లో ప్రొఫెషనల్‌గా గైడెన్స్ ఇచ్చినప్పటికీ, ఆయన సమస్యల తీవ్రత చూసి ఆ తర్వాత ఒక మంచి స్నేహితురాలిగా మారాను. నేను ఎవరి ఇల్లు కూల్చలేదు. ఒకరి సంసారాన్ని ముంచాల్సిన అవసరం లేదు. నెటిజన్లు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై విషం చిమ్మడం ఆపి, సామాన్యుల సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం కేనిషా చేసిన ఈ వైరల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird