Home సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. ఆ 100 కోట్లకి వాల్యూ లేదు – Andhra Waves

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. ఆ 100 కోట్లకి వాల్యూ లేదు – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)భామ సరయుకి కోపం వచ్చేసింది. అదేనండి మన బద్రి సరయు ఉరఫ్ అమీషా పటేల్(Ameesha Patel)కి. ఇది మాములు కోపం కాదు, ఒక రకంగా సంచలనానికి వేదికగా నిలిచే కోపం. మరి అమీషా కోపం మనతో ఏం చెప్తుందో చూద్దాం

రీసెంట్ గా అమీషా ఎక్స్ వేదికగా తమ కెరీర్‌లో ఒక్క సినిమా కూడా 200 కోట్లు సాధించిన హీరోయిన్లు, తమ పీఆర్ టీమ్స్‌కి డబ్బులిచ్చి తమని తాము ‘నెంబర్ 1’, ‘నెంబర్ 2′ అని పిలిపించుకుంటున్నారు. అది కేవలం పీఆర్ స్టంట్స్. వాళ్ళకి తెలుసా అని తెలియదు. ఇది 2000వ సంవత్సరం కాదు. 2026.. ఇప్పుడు 100 కోట్లు అంటే ఏమీ లేనట్టే. కేవలం సంవత్సరానికి రెండు యావరేజ్ సినిమాలు చేస్తూ, షూటింగ్ సెట్స్‌లో ఉంటేనే స్టార్ అయిపోరు.నేను చేసిన కహో నా ప్యార్ హై’ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ గత తేడా విడుదలైన ‘గదర్ 2’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.కేవలం ప్రచారంతో కాకుండా, థియేటర్లకి వచ్చే జనాన్ని బట్టి ఒక నటి స్థాయిని నిర్ణయించాలని అమీషా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రేజర్: రేజర్ తొలిరోజు కలెక్షన్స్ ఇవేనా!.. ఇక రికార్డులే తరువాయి

అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లోని ప్రస్తుత కాంపిటీషన్, హీరోయిన్ల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ని తెలియచేస్తుంది. ఆమె నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, ‘పీఆర్ గేమ్స్’ ఆడుతున్నది ఎవరనే దానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, 100 కోట్ల క్లబ్ తగ్గిపోయిందన్న ఆమె మాటలు నిజంగానే ఉన్నాయని సినీ విశ్లేషకులు కూడా ఉన్నారు. 2000 వ సంవత్సరంలో కహా నా ప్యార్ హైతో కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా ఇప్పటి వరకు ముప్పై సినిమాల వరకు చేసింది. బద్రి ఆమె సెకండ్ మూవీ. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు యాభై. స్వస్థలం ముంబై

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird