Home Latest News బిల్లు అడిగితే కత్తులతో దాడి… సరూర్‌నగర్‌లో రౌడీ షీటర్ల దౌర్జన్యం | సరూర్‌నగర్‌లో రౌడీ షీటర్ల దౌర్జన్యం | రెస్టారెంట్ సిబ్బంది బిల్లు | ఎదుల ప్రసన్న రెడ్డి | ఎదుల యశ్వంత్ రెడ్డి | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ – Andhra Waves

బిల్లు అడిగితే కత్తులతో దాడి… సరూర్‌నగర్‌లో రౌడీ షీటర్ల దౌర్జన్యం | సరూర్‌నగర్‌లో రౌడీ షీటర్ల దౌర్జన్యం | రెస్టారెంట్ సిబ్బంది బిల్లు | ఎదుల ప్రసన్న రెడ్డి | ఎదుల యశ్వంత్ రెడ్డి | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీషీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. బిల్లు చెల్లించమని అడిగిన సిబ్బందిపై కత్తులు, కట్టెలతో విరుచుకుపడిన దుండగులు హింసకు దిగడంతో ఈ ఘటన నగరంలో రచ్చ రచ్చ చేసింది. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో రెస్టారెంట్‌నగర్‌లోని కొంతమంది యువకులు సరూర్‌లోని అర్బన్‌కు వచ్చి భోజనం చేశారు. భోజనం అనంతరం రెస్టారెంట్ సిబ్బంది బిల్లు చెల్లించాలని కోరగా, మొదట వాగ్వాదానికి దిగారు. క్షణాల్లోనే ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, దుండగులు రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి పాల్పడుతూ హంగామా సృష్టించారు.

దుండగులు ముందే సిద్ధమైనట్లు అనిపించేలా కత్తులు మరియు కట్టెలతో హోటల్ సిబ్బందిపై విరచికుడుతూ హోటల్‌లో ఉన్న అద్దాలు మరియు ప్లేట్లు పగలగొడుతూ కస్టమర్లను బయటకు వెళ్లి పొమ్మంటూ బెదిరింపులకు గురి చేస్తూ నానా హల్చల్ సృష్టించారు. రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం బాధితులు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విచారణ నిందితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేరచరిత్ర కలిగిన ఏడుల ప్రసన్ రెడ్డి మరియు ఏడుల యశ్వంత్ రెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారిని పట్టు కునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్‌ను ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఈ ఇద్దరు దారుణంగా హత్య చేశారు.

ఈ నిందితులను పట్టుకునే దుకు పోలీసులు జల్లడుతున్నారు. ఈ ఘటనతో సరూర్‌నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన మరోసారి నగరంలో రౌడీ షీటర్ల అల్లర్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చూపిస్తోంది. .

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird