పోస్ట్ చేయబడింది జనవరి 19, 2026 2:17PM

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో సకీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో న్యాయమూర్తి సంజయ్ కరోల్ అనుమతిని ధర్మాసనం సోమవారం (జనవరి 19) విచారణ చేపట్టారు. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన ప్రకారం.. నెలల్లోపు పార్టీ మారిన నిర్ణయం స్పీకర్‌కు సూచించింది.. ఆ తీర్పును అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
