హైదరాబాదులోని కొండాపూర్‌లో నడుస్తున్న కార్‌లో ఒక్కసారిగా మంటలు చెదరేగాయి. శనివారం (మే 9) రాత్రి ఓ బెంజ్ కార్ గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వైపు వెళుతున్న సమయంలో కొత్తగూడెం సిటీ మాల్ సమీపంలో ఒక్కసారిగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారు ను ఆపేసి బయటకు దిగి పరుగులు తీశాడు దీంతో ప్రాణనష్టం తప్పింది. క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. నడిరోడ్డు మీద కారు మంటల్లో దగ్ధం అవుతుండడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంటల్లో కారు మొత్తం దగ్ధమైంది… సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. షార్ట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
