
– దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సవాల్
– ఇద్దరి మధ్య మాటల యుద్ధం
– మధుసూదన్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను ఇకముందు ఎమ్మెల్యే కు పోటీచేయనంటున్న ఆల
– ఎమ్మెల్యే అవినీతిలో రాజ్యమేలాడు.. ఇసుక దందాలో అరితేరారు
– బీఆర్ ఎస్ నేతలపై అక్రమ కేసు లు పెడుతున్నారు
– నా పై అనవసర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు
– మీడియా సమావేశంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
…………………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ ప్రతినిధి :
…………………………………………….
దేవరకద్ర నియోజకవర్గం లోని చెరువుల్లో నల్ల మట్టిని కొల్లగొట్టి రూ. కోట్లు సంపాదించాలని… ప్రతి పనికి ఒక రేట్ నిర్ణయించి ఎమ్మెల్యే పదవికే మచ్చ తెచ్చావని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే మాటలకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే శుక్రవారం దేవరకద్ర లో మీడియా సమావేశం పెట్టి ప్రస్తుత ఎమ్మెల్యే పై మాటలతో దుమ్మెత్తి పోశారు. మాజీ మాటల్లోనే… ప్రజలు అవకాశం ఇచ్చారని మేము అనడం లేదు…మా మీద అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ఊరికే కూర్చునే అలవాటు లేదు..రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని భావించాం.. కానీ మధుసూదన్ రెడ్డి చదువుకున్న మూర్కుడు
మా హయాంలో తాను సివిల్ ఇంజినీర్ గా పని చేసి ఎమ్మెల్యేగా సొంతంగా ఆలోచించి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించాం.
పెద్ద ,ఊక చెట్టు వాగుల పై 36 చెక్ డ్యాంల నిర్మాణం చేసి నీటిని ఒడిసిపట్టమన్నారు.అతి తక్కువ ఖర్చుతో బండర్ పల్లి వద్ద చెక్ డ్యామ్ నిర్మించామని,కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లో లేదని, సొంతంగా అక్కడ తిరిగి రిజర్వాయర్ నిర్మాణం చేయాలని కేసీఆర్ ను ఒప్పించాం.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్ అని,అయన న్యాయవాద న్యాయవాద తెలివి అక్రమ కేసులు,సెక్షన్ లు, ఎఫ్ ఐ ఆర్, ఛార్జ్ ఛార్జ్ ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నారు.ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం మార్చమని అడిగిన వారిపై కేసు పెట్టి జైలులో వేశాము. పెంచిన.కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం.. ఇద్దరం ప్రమాణం చేద్దాం..నల్లమట్టి అమ్ముకోలేదని ప్రమాణం చేస్తానని, 100 రోజుల్లో ఆరుగురు గ్యామన్నారు రాజీనామా చేస్తానని నువ్వు కురుమూర్తి స్వామి దగ్గర బాండు పేపర్లు రాసి సంతకం పెట్టావు.. ఎమ్మెల్యే గా మళ్లీ పోటీ చేయనని ప్రస్తుత ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తమ్ముడు చెక్ డ్యామ్ లు కడితే అప్పుడే కొట్టుకుపోయిందని,నియోజకవర్గంలో ఇసుక దందాలో అరితేరారని,ప్రతి బండికి ఓ రేట్ కట్టి వసూలు చేసిన ఎమ్మెల్యే పై ఉన్నారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఏం చేస్తున్నావో అంతా తెలుసు… ఇకముందు బాష మార్చుకోక పోతే వీడియోలు, ఫోటోలు బయటికి వస్తాయని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక.