* జిల్లా కలెక్టర్, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోని వైనం
* రాజకీయ ఒత్తిళ్లే కారణమా??
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాల్సి ఉండగా, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంపై గద్వాల మండలం బసాపురం గ్రామస్తులకు ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లతో జాబితాను తయారు చేస్తున్నారు. దీంతో నిరుపేదలకు దక్కాల్సిన ఇళ్లు.. అనర్హులకు అందించిన గ్రామస్తులు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వ్యక్తి పేరు మీద వ్యవసాయ పొలం ఉందని, వాళ్లింట్లో ఒకరు ఉద్యోగం కూడా చేస్తున్నారు. గద్వాల ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ కు ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలు చాలమంది ఉన్నారని, ఇప్పటికి పూరి గుడిసెలో ఏర్పాటు చేశారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.