Home Latest News పెళ్లి పేరుతో 67 మందికి వలపు వల…నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్ | నకిలీ CISF అధికారి | శంషాబాద్ విమానాశ్రయం | హైదరాబాద్ క్రైమ్ న్యూస్ | వైవాహిక మోసం | RGIA పోలీస్ | మహిళల భద్రత | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ శివధర్ రెడ్డి | హైదరాబాద్ పోలీసులు | CISF | శ్రీకాకుళం జిల్లా | RGIA – Andhra Waves

పెళ్లి పేరుతో 67 మందికి వలపు వల…నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్ | నకిలీ CISF అధికారి | శంషాబాద్ విమానాశ్రయం | హైదరాబాద్ క్రైమ్ న్యూస్ | వైవాహిక మోసం | RGIA పోలీస్ | మహిళల భద్రత | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ శివధర్ రెడ్డి | హైదరాబాద్ పోలీసులు | CISF | శ్రీకాకుళం జిల్లా | RGIA – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారిగా తిరుగుతున్న వ్యక్తిని అసలు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నాడు. అతని ప్రవర్తనపై అను మానం కలిగిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిపై నిఘా పెట్టారు.. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది.బాలకృష్ణ సీఐఎస్‌ఎఫ్ అధికారిగా నటిస్తూ మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా యువతతో పరిచయం మోసం చేస్తూ అధికా రులు పేర్కొన్నారు.

బాలకృష్ణ మొదటి భార్య వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను సీఐ ఎస్‌ఎఫ్ అధికారిగా నటి చాడని ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నట్లు సమా చారం….అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా వందలాది యువతులతో చాటింగ్ చేసిన ఆధారాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణను అదుపులో ఉంచి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు భద్రతా వ్యవస్థ అప్రమ త్తమైంది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిగా నటిస్తూ అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్న ఒక నిందితుడిని భద్రతా సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు ఖరీదైన యూనిఫాం ధరించి ఎయిర్‌పోర్టులో హల్ చల్ చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలంటే దురాశతో అడ్డదారి తొక్కాడు. తాను సీఐఎస్‌ఎఫ్ అధికారిగా పనిచేస్తున్నానని అందరినీ నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులు, ఖాకీ డ్రెస్ సిద్ధం చేసుకున్నాడు. ఈ విధంగానే శంషాబాద్ విమానాశ్రయంలో యూనిఫాంతో తిరుగుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటుండగా భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. అతడిని ఆపి గుర్తింపు కార్డు అడగగా, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు బండారం బయటపడింది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. బాలకృష్ణకు ఇప్పటికే వివాహం జరిగి భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత రెండో పెళ్లి నెపంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లలో తన ప్రొఫైల్‌ను “గవర్నమెంట్ ఆఫీసర్”గా సృష్టించాడు. తాను విమానాశ్రయంలో కీలక బాధ్యతలను నమ్మడానికి ఎయిర్‌పోర్టు ఆవరణలో దిగిన ఫొటోలను యువతకు పంపేవాడు. ఇలా ఇప్పటి వరకు సుమారు 67 మంది మహిళలకు వల వేసి, వారి నుంచి భారీగా నగదు, నగలు వసూలు చేసినట్లు సమాచారం.

నిందితుడి ప్రవర్తనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం పెళ్లి పేరుతో మోసాలే చేశాడా లేక భద్రతాపరమైన అంశాల్లో ఏదైనా అక్రమాలు సాగాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. నిందితుడి వద్ద నుంచి నకిలీ యూనిఫాం, గుర్తింపు కార్డులతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మరియు పౌర సమాజంలో తీవ్ర చర్చ నడుస్తోంది. మ్యాట్రిమోనీ సైట్లలో కనిపించే ఆకర్షణీయమైన ప్రొఫైల్స్‌ను చూసి గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబంధం ఖాయం చేసుకునే ముందు వ్యక్తి ఉద్యోగం, వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో విచారించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణను రిమాండ్‌కు తరలించిన పోలీసులు, బాధితులెవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ వేదికగా జరిగే ఇటువంటి మోసాల పట్ల మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird