-వకీల్ సాబ్ తో ప్రత్యేక గుర్తింపు
-ఈ సారి హిట్ పక్కా అంట
-ఆ సీక్రెట్ నే కారణమా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)పవర్ ప్యాక్డ్ మూవీ వకీల్ సాబ్ తో మూవీ లవర్స్ ఛాయ్, బిస్కెట్ డిస్కర్షన్ లో చోటు సంపాదించిన భామ అనన్య నాగళ్ళ(అనన్య నాగళ్ళ). అంతలా దివ్య నాయక్ గా నాచురల్ పెర్ఫార్మ్ తో కట్టిపడేసింది. దీంతో తన సినీ రేంజ్ ఎలాంటి మలుపు తిరగబోతుందా అని అందరు ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఎలాంటి హడావిడి లేదు. మధ్యలో కొన్ని చిత్రాలు చేసినా అవి పేరుకి మాత్రమే ఉన్నట్లయ్యింది. చిత్రాల కౌంట్ కూడా పెద్దగా లేదు. ఎందుకని ఇలా అనుకుంటున్న తరుణంలో తనే ఆ విషయాన్నీ బయటపెట్టింది. మరి ఆ విషయమేంటో చూసేద్దాం.
అనన్య తన కొత్త మూవీ ‘లీసా'(లీసా)తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవ్వబోతుంది. ఈ మేరకు నిన్న టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతుంది ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా, నేను కొత్తగా ఏముంది అనుకుంటా. అలా కొత్తగా ఉండబట్టే ‘లీసా’ ఒప్పుకున్నాను. హీరోయిన్ కి ఇలాంటి క్యారెక్టర్స్ అరుదుగా వస్తుంటాయి. ఖచ్చితంగా నా కెరీర్ లో మైలురాయిలా గుర్తుండిపోయే మూవీ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Ott: ఊహకి అందని తెలుగు ఓటిటి హర్రర్ థ్రిల్లర్.. ఈ నెల 17న మీ కోసమే వస్తుంది
టైటిల్ చూస్తుంటే అనన్య మెయిన్ రోల్ అనే విషయం అర్ధమవుతుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ ని తన సినీ లాకర్ లో భద్రపరుచుకుంటుందేమో చూడాలి. జవహర్ లాల్ దర్శకత్వంలో వైఎస్ మేకర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి, రమేష్ ఐలా నిర్మించారు.

