ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట మున్సిపల్ సౌజన్యంతో గుండ్లపల్లిలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణ యాదవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ నెంబర్ పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండలు, పేరబోయిన మహేందర్, కంబాల సాయి తేజ్,పబ్బల నరసింహ, కంబాల సాయి కుమార్, బండి అనిల్ ఉన్నారు.