నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసమే ఎగబడుతున్న జనం అనుకుంటున్నారా కాదండోయ్ తమ పిల్లలకు అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాఠశాల గేటు ముందు తెల్లవారుజాము నుంచే క్యూలైన్ కట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరగడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. పాఠశాల స్కూళ్లకు ధీటుగా, పోటీగా మారిన ఈ జిల్లా పాఠశాలపై జిల్లా ప్రజలతో పాటు ఇతర తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వంత నిధులతో అభివృద్ధి చేశారు.
ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ విద్యా మందిరంలో స్మార్ట్ క్లాస్, ఏఐ ఆధారిత బోధనలు, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు విశాలమైన క్రీడా మైదానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పాఠశాల ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందించిన నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
ఈ పాఠశాల పేరు ప్రతిష్ఠలు పెరగడంతో నల్గొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్కూల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు సోమవారం తెల్లవారుజామున పాఠశాల గేటు ముందు క్యూలు కట్టారు…ప్రభుత్వ విద్యలో కొత్త దశకు నాంది పలుకుతున్న ఈ పాఠశాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
.webp)