Home సినిమా కన్నీళ్లు పెట్టుకున్న అడివి శేష్.. ఆ అభిమాని గాథ అలాంటిది! – Andhra Waves

కన్నీళ్లు పెట్టుకున్న అడివి శేష్.. ఆ అభిమాని గాథ అలాంటిది! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో ‘థాంక్స్ మీట్’ నిర్వహించింది. ఈ వేడుకలో అడివి శేష్ తన జీవితంలో ఎదురైన ఒక హృదయ విదారకమైన, అదే సమయంలో స్ఫూర్తిదాయకమైన ఘటనను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

బెంగళూరులో జరిగిన ప్రమోషన్స్ సమయంలో తమిళనాడుకు చెందిన ఒక న్యాయవాది తనను కలిసినట్లు శేష్. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. “ఆ లాయర్‌పై గతంలో సుమారు 150 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారట. తీవ్ర గాయాలతో నెలల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయిన ఆయన, మానసికంగా కూడా బాగా కుంగిపోయారు. బయటకు రావాలంటేనే ప్రాణభయం వెంటాడేదట. కానీ, ఆ క్లిష్ట సమయంలో నా ‘మేజర్’ సినిమా ఆయనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, ఆ మూవీ చూశాక మళ్లీ ఆశలు చిగురించాయని.

అంతేకాకుండా, ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందని తెలిసి, కేవలం తనను కలవడానికి, థాంక్స్ చెప్పడానికే ఆ వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా థియేటర్‌కు వచ్చినట్లు శేష్ చెప్పారు. “మనం సినిమాలను కేవలం లెక్కలు, కలెక్షన్లు, బిజినెస్ పరంగానే చూస్తాం. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేస్తుందని నేను ఊహించలేదు. ఆ లాయర్ మాటలు నాకు మానవత్వాన్ని గుర్తుచేశాయి. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో ఆ క్షణం నాకు అర్థమైంది” అని శేష్ ఎమోషనల్ అయ్యారు.

అడివి శేష్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆయన ఏంచుకునే కథల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, సందీప్ ఉన్నికృష్ణన్ కథను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు ‘డెకాయిట్’లో ఒక మాస్ అండ్ ఇంటెన్స్ పాత్రలో మరోసారి మెప్పించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, షానిల్ డియో దర్శకత్వం వహించారు.

సోషల్ మీడియాలో కూడా అడివి శేష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ వారు తనకు ఒక జాతీయ జెండాను బహుమతిగా ఇచ్చారని, ఆ ప్రేమ ముందు ఏ అవార్డూ సరితూగదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు డబ్బుల కంటే ‘గుడ్ సినిమా’ చేసే హీరో అనే క్రెడిబిలిటీయే ముఖ్యమని, ప్రేక్షకులు ఇస్తున్న ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని శేష్ అన్నారు.

ప్రస్తుతం ‘డెకాయిట్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న శేష్, తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గూఢచారి 2’ (G2) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ‘డెకాయిట్’ ఇచ్చిన బూస్ట్‌తో శేష్ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో అలరించడం ఖాయంగా కనిపించింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird