తెలంగాణలోని నిర్మల్ జిల్లా విషాదకర ఘటన. మహాలక్ష్మి వాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లా ప్రాంతంలోని మహాలక్ష్మి వాడలో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న విజయ్ మరియు మరో మహిళ మంటల్లో చిక్కుకున్నారు. వారు గట్టిగా అర్థనాదాలు చేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించారు.
మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ దట్టమైన పొగలు బయటకు రావడంతో, స్థానికులు ఇద్దరినీ బయటకు తీసి ఆసుపత్రికి వచ్చారు. అయితే తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
