-థియేటర్స్ లో సక్సెస్ అందుకున్నారు
-చాలా సున్నితమైన సబ్జెట్
-మీ కోసమే ఓటిలోకి
ఈ మధ్య కాలంలో ఏ ముగ్గురు మూవీ లవర్స్ కలిసినా ‘యుఫోరియా'(Euphoria)సూపర్ గా ఉంది. నేటి యువతతో పాటు తల్లితండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. ఆలోచింప చేసే సబ్జెట్ కావడంతో పాటు యువతికి జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. గుణశేఖర్(గుణశేఖర్)కూడా అత్యద్భుతంగా తెరకెక్కించాడు. కానీ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నాయనేది నిజమేరా! లేదంటే ‘యుఫోరియా’ ఎంత బాగా ఆడాల్సిన మూవీ అని మూవీ లవర్స్ యుఫోరియా విషయంలో ఎంతగానో బాధపడ్డారు. అది నిజం కూడాను. యుఫోరియాకి దక్కాల్సిన విజయం మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా సరికొత్త సినీ కదనరంగంలోకి దూకబోతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
యుఫోరియా ఈ బుధవారం అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈటీవీ విన్(Etv WIn)లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఈ మేరకు ఓటిటి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గుణశేఖర్ తో పాటు ఈటీవీ విన్ యాజమాన్యం ప్రీ స్ట్రీమింగ్ వేడుకని నిర్వహించి మరి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. దీన్ని బట్టి యూఫోరియాకి ఉన్న ప్రాముఖ్యతని అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ ని కూడా రెండు విభాగాల్లో గుర్తించిన విషయం తెలిసిందే.
కూడా చదవండి: జననాయకన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
దీంతో ‘యూఫోరియా’ చూడాలని ఉన్నా థియేటర్స్ లో లేకపోయేసరికి నిరుత్సాహపడ్డ వాళ్లంతా ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని’యుఫోరియా’ని వీక్షించవచ్చు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ పక్కా. మరి 99 రూపాయలతో ఈటీవీ విన్ డౌన్ లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ధురంధర్ భామ సారా అర్జున్(సారా అర్జున్),ఒకప్పటి హీరోయిన్ భూమిక(భూమిక)తో పాటు మిగిలిన ఆర్టిస్టులు మిమ్మల్ని అలరించడంలో ఏ మాత్రం పక్షపాతం చూపించారు.
