ఢిల్లీలోని భారత మండపం వేదికగా ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహా పలు ప్రముఖ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఏపీ సర్కార్ ఈ ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో క్వాంటం-ఏఐఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ఏపీని క్వాంటం-ఏఐఐ హబ్ గాడం అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, ఏపీలో ఏఐఐ-క్వాటం ఏకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేసేలా ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి.
క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంఓయూ చేసుకుంది. ఏఐ-క్వాంటమ్ డిజిటిల్ ఎంబాసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేందుకు ఈ ఎంయూయూ అందిస్తుంది.
అలాగే, క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఒప్పందం చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం అంగీకరించింది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణను రూపొందించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిసాఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఎన్ఐఎల్ఐటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటమ్ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక రూపొందించబడింది. అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు పమకూరుస్తుంది. ఇక దీనికి అవసరమయ్యే భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఈ ఒప్పందం కుదిరింది.
అదే విధంగా రాష్ట్ర ఏఐఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది.
ఇక పోతే ఏపీ 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ సాధించింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రాడ్యుయేట్లు, జీ విద్యార్థులలో టెక్నాలజీపై అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు, ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం, నైపుణ్య శిక్షణ వంటి అంశాల ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో ఈ ఒప్పందం కుదిరింది.
కాగా అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేస్తారు. ఇక ఏడో ఒప్పందం రాష్ట్రంలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ తో చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
.webp)