తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమీషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌లో రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించారు. టీటీడీ పరిపాలన లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల్లో నివేదిక అందించిన ఆదేశాలు జారీ చేసింది.
కాగా శ్రీవారి లడ్డూ నెయ్యి ఘటనలో కల్తీపై సీబీఐ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమీషన్‌ను తాజాగా నియమించింది. కోర్టు విచారణలపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కమిటీ నివేదికల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు సీఈఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
