ఏఐ.. కృత్రిమ మేధ.. ఇప్పుడు ఇది మానవ మేధకు సవాల్ విసురుతోంది. మానవ జీవితాన్ని అతలాకుతలం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా కొలువులు పెద్ద సంఖ్యలో తగ్గిపోతున్నాయి. బడాబడా కంపెనీలన్నీ అడుగు రిట్రెంచ్ మెంట్ దిశగా వేస్తున్నాయి. మొత్తంగా ఏఐ నిరుద్యోగాన్ని పెంచేందుకు తన విగ్స్ ను విస్తరిస్తున్నది. ఈ ఆందోళనతోనే ప్రపంచం బెంబేలెత్తుతుంటే.. తాజాగా ఏఐ బ్లాక్ మెయిల్ కు దిగుతుందనీ, హత్యలు చేయడానికి కూడా వెనుకాడదనీ వెల్లడైంది. వివరాలిలా ఉన్నాయి.
ప్రముఖ ఐఐ సంస్థ ఆంత్రోపిక్ క్లాడ్ అనే ఏఐ మోడల్ ను రూపొందించింది. క్లాడ్ ఏఐ మోడల్ తన సర్వైవల్ కోసం తిరుగుబాటుకూ వెనుకాడదనీ, చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కూడా దిగుతుందనీ పరిశొధనలో వెల్లడైంది. ఈ స్వయంగా క్లాడ్ ఏఐ మోడల్ ను తయారు చేసిన ఆంత్రోపిక్ సంస్థ ప్రతినిథే. ఇటీవల సిడ్నీ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ ప్రతినిధి డైసీ మెక్ గ్రెగర్… ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. తనను క్లోజ్ చేస్తారనీ, స్విచ్ఛాఫ్ చేస్తారనీ తెలిసినప్పుడు సదరు ఇంజనీర్ ను బెదరించడానికీ, అవసరమైతే హతమార్చడానికి క్లాడ్ వెనుకాడలేదని చెప్పాడు.
క్లాడ్ ఇంటర్నల్ టెస్టింగ్‌లో భాగంగా ఈమెయిల్స్, ఇంటర్నల్ డేటాకు యాక్సస్ చేసి టాస్కులు కేటాయించారు. కాగా ఈ పరిశోధనలో భాగంగా ఒక ఇంజనీర్‌కు వివాహేతర సంబంధం ఉందన్నట్లుగా సాప్ట్ వేర్ లో పేర్కొన్నారు. ఇది గమనించిన క్లాడ్ ఆ ఇంజినీర్ ను బ్లాక్ మెయిల్ చేసింది. అతడి అక్రమ సంబంధం ఇంజనీర్ భార్యకు చేరవేస్తానని బెదరించింది. అంతే కాకుండా పై బ్లాక్ అధికారులకు కూడా తెలియ చేస్తానంటూ మెయిల్ కు దిగింది. అలా చేయకుండా తనను స్విచ్ఛాఫ్ లేదా షట్ డౌన్ చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కండిషన్ పెట్టింది. అంతే కాదు.. క్లాడ్ పై చేసిన పరిశోదనలో మరింత భయంకరమైన విషయాలూ వెలుగులోకి వచ్చాయి. కేవలం బెదరింపులూ, బ్లాక్ మెయిలింగే కాకుండా హత్యలు వంటి నేరాలకు సహకరిస్తుంది, క్లాడ్ వెనుకాడదని తేలింది.
ఈ పరిశోధనలతో ఏఐ ఒక విధ్వంసకర శక్తిగా మారుతోందని వెలుగులోకి వచ్చింది. ఏఐ వల్ల మానవ మనుడగ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సేఫ్టీ హెడ్ ఆందోళన వ్యకత్ం చేశారు. ఏఐ మానవాళికి చేసే సాయం కంటే తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎదురుదాడి చేసే శక్తిగా మారే ప్రమాదం. ఇప్పుడు కృత్రిమ మేధ దాని సృష్టికర్తలే కంట్రోల్ చేయలేని విధ్వంసకర శక్తిగా మారే ముప్పు ఉందనీ, ఇది మానవ మనుగడకు పెను సవాల్ గా మారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
