డిసెంబర్ 22, 2025 3:59PMన పోస్ట్ చేయబడింది

సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ సింగ్ మన్మీత్ ప్రీతం అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతున్నారు, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టుకు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.
అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు కూడా జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది. అలాగే, వివాదస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
.webp)